గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్_2 డిపోలో ఆదివారం తెల్లవారుజామున ఆగిఉన్న ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆర్టీసీ, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావించారు.
కాగా, డిపో మేనేజర్ రవి మాట్లాడుతూ బస్సుల్లో 12 బ్యాటరీలు ఉంటాయని, అందులో ఒకదాంట్లో మంటలు రాగా, వెంటనే ఆర్పేశామని చెప్పారు. ఎటువంటి ప్రమాదం, నష్టం జరగలేదని తెలిపారు.
