నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి మంగళవారం కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి సుమారు రూ.12.31 లక్షలతో 9 మంది దివ్యాంగులకు ఈ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేందుకు ఇలాంటి ఆధునిక పరికరాలు ఎంతో తోడ్పడతాయని, సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
