- కొన్ని గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, టొలిన్స్ ఐపీఓలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ఏథర్ త్వరలో ఐపీఓకి రాబోతోంది. ప్రిలిమినరీ పేపర్లను సెబీ వద్ద సబ్మిట్ చేసింది. వీటి ప్రకారం ఈ పబ్లిక్ ఇష్యూలో ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.3,100 కోట్లను సేకరించాలని ఏథర్ చూస్తోంది. కంపెనీ షేర్ హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద 2.2 కోట్ల షేర్లను అమ్మనున్నారు. ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా సేకరించిన ఫండ్స్‌ను మహారాష్ట్రలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు, మార్కెటింగ్ కోసం, అప్పులు తీర్చడానికి వాడనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ తర్వాత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రెండో ఎలక్ట్రిక్ కంపెనీగా ఏథర్ నిలవనుంది.
ఫుల్ డిమాండ్
బజాజ్ గ్రూప్ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి భారీ డిమాండ్ కనిపిస్తోంది. కంపెనీ ఐపీఓ సోమవారం ఓపెనైన కొన్ని గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. సుమారు 72.7 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా, 73 కోట్ల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. ఈ నెల 11 తో కంపెనీ ఐపీఓ ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.66–70 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతున్నారు. మరో ఐపీఓ టొలిన్స్ టైర్స్ ఐపీఓ కూడా ఓపెనైన గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. సుమారు 75 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టగా, 84 లక్షల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. కంపెనీ ఐపీఓ కూడా సెప్టెంబర్ 11 తో ముగియనుండగా, ఒక్కో షేరుని రూ.215– 226 రేంజ్‌లో అమ్ముతున్నారు.
Also Read :- ఏఐ ఫర్ లీడర్స్ ప్రోగ్రామ్ ప్రారంభం
సెప్టెంబర్ 13 నుంచి వెస్టర్న్ క్యారియర్స్ ఐపీఓ..
లాజిస్టిక్స్ కంపెనీ వెస్టర్న్ క్యారియర్స్ ఐపీఓ ఈ నెల 13 న ఓపెన్ అవుతుంది. 18 న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 12 న ఓపెన్‌లో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది.