కరెంటు బండ్ల కంపెనీలు సబ్సిడీ తిరిగి ఇవ్వాల్సిందే

కరెంటు బండ్ల కంపెనీలు సబ్సిడీ తిరిగి ఇవ్వాల్సిందే
  • చైనా పార్టులు వాడటమే కారణం
  • ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరెంటు బండ్లు తయారు చేసే ఆరు స్టార్టప్​ కంపెనీలు చైనా నుంచి విడిభాగాలు తెచ్చి వాడటంతో, తాము పొందిన సబ్సిడీ మొత్తం రూ. 500 కోట్లను తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.లోకలైజేషన్ రూల్స్​ను పాటించడంలో ఈ కంపెనీలు విఫలమైనట్లు దర్యాప్తులో తేలింది. ఈ–స్కూటర్లు కొన్ని పేలిపోవడంతో కిందటేడాదిలో అసలు ఈ కంపెనీలు లోకలై జేషన్​ రూల్స్​ ఏ మేరకు పాటిస్తున్నాయనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. 

ఈ దర్యాప్తులోనే కొన్ని కంపెనీలు చైనా నుంచి రెడీ టూ యూజ్​ పార్టులను కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడైంది. ఫలితంగా క్వాలిటీ దెబ్బతింటున్నట్లు గుర్తించారు. లోకలైజేషన్​ రూల్స్​ కరెంటు బండ్ల తయారీ కంపెనీలను కొంత ఇబ్బందికి గురి చేస్తున్నట్లు ఎక్స్​పర్టులుచెబుతున్నారు.