ఎలక్ట్రికల్ ​షాప్​లో రూ. 6 లక్షల సామగ్రి చోరీ .. శంకర్​పల్లిలో ఘటన

ఎలక్ట్రికల్ ​షాప్​లో రూ. 6 లక్షల సామగ్రి చోరీ .. శంకర్​పల్లిలో ఘటన

శంకర్ పల్లి, వెలుగు:  ఓ ఎలక్ట్రికల్ ​షాపులో రూ. లక్షల విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శంకర్​పల్లి సీఐ వినాయక్​ రెడ్డి తెలిపిన ప్రకారం..  మండలంలోని మహాలింగపురం గ్రామ శివారులో మహమూద్​కు ఎలక్ట్రికల్​బోర్ వైండింగ్ షాపు ఉంది. మంగళవారం రాత్రి అతడు షాపు మూసి ఇంటికి వెళ్లాడు. 

బుధవారం ఉదయం వచ్చి షాపు తెరిచి చూసే సరికి సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. రూ. 6లక్షల విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించాడు. షాపు వెనకాల నుంచి రంధ్రం పెట్టి ఉంది.  ఆధారాలు దొరకకుండా షాపులోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ లను సైతం దొంగలు మాయం చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్​ చేశారు.