వచ్చే నెల నుంచి కరెంట్ ట్రూఅప్ చార్జీలు.. మొదటి నెల యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 30 పైసలు, ఆ తర్వాత నుంచి 50 పైసలు

వచ్చే నెల నుంచి కరెంట్ ట్రూఅప్ చార్జీలు.. మొదటి నెల యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 30 పైసలు, ఆ తర్వాత నుంచి 50 పైసలు
  • మొదటి నెల యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 30 పైసలు, ఆ తర్వాత నుంచి 50 పైసలు
  • ఎస్పీడీసీఎల్లో 29 నెలలు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ లో 26 నెలలు వసూలు 
  • వ్యవసాయ బిల్లులు 2,215 కోట్లు ప్రభుత్వం నుంచి వసూలుకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల నుంచి సర్దుబాటు (ట్రూఅప్) చార్జీల వసూలుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అధారిటీ (ఈ ఆర్ సీ) అనుమతి ఇచ్చింది. మొదటి నెల నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూనిట్కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్ కు 50 పైసల చొప్పున ఎస్పీడీసీఎల్ పరిధిలో 29 నెలలు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ పరిధిలో 26 నెలల పాటు మొత్తం రూ.5,420 కోట్లు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. వ్యవసాయానికి సంబంధించి రూ.2,215 కోట్ల సర్దుబాటు చార్జీలు రైతుల నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.

రెండేళ్లలో రూ.7,635.22 కోట్లు లాస్
డిస్కంల విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాలో 2022–23 కొనుగోలు వ్యయం, 2023–24 ఆదాయం మధ్య వ్యత్యాసంతో రూ.7,635.22 కోట్ల నష్టం వచ్చింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలు నిర్ణయించాయి. టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.5,665.42 కోట్లు, టీజీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.1,969.80 కోట్లు వసూలు చేసుకునేందుకు ఆమోదం లభించింది.

వ్యవసాయ వినియోగదారులపై ఈ భారం వేయడం లేదు. వ్యవసాయ బిల్లుల వాటా రూ.2,214.99 కోట్లలో టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ రూ.1,442.49 కోట్లు, టీజీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ రూ.772.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. మిగిలిన రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు.
 
వచ్చే నెల నుంచి వసూళ్లు 
నవంబర్ 2026 సీసీ బిల్లుల నుంచి ఈ చార్జీల వసూలు ప్రారంభమవుతుంది. "బిల్లులో ట్రూ-అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలను వేరే లైన్ ఐటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూపాలని, చార్జీల వసూలుపై తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ పత్రికల్లో నోటీసు ఇవ్వాలని, త్రైమాసిక వసూళ్ల నివేదిక అథారిటీకి సమర్పించాలని పేర్కొన్నారు.

సర్దుబాటు చార్జీలను గతంలోనే వసూలు చేయాల్సిఉండగా ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరింది. తిరిగి డిస్కమ్​ల అభ్యర్థన మేరకు ఈ చార్జీలను దశలవారీ వసూలు చేసుకునేందుకు ఈ ఆర్ సీ అంగీకరించింది.