సిద్ధిపేట సర్కిల్ ఆఫీస్ ఎదుట విద్యుత్​ ఉద్యోగుల మహా ధర్నా

సిద్ధిపేట సర్కిల్ ఆఫీస్ ఎదుట విద్యుత్​ ఉద్యోగుల మహా ధర్నా

సిద్దిపేట రూరల్/ మెదక్​టౌన్​,  వెలుగు: విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిద్దిపేట సర్కిల్ ఆఫీస్ ఎదుట విద్యుత్​ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వీరభద్రయ్య,  లీడర్లు గంగాధర్, హుస్సేన్,  శ్రీనివాస్​రెడ్డి, శ్రీనివాస్, చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు తో పేదలు, రైతులపై తీరని భారం పడుతుందన్నారు.  విద్యుత్ సంస్థలు కార్పొరేట్​సంస్థల  చేతుల్లోకి పోతే అందరూ నష్టపోతారన్నారు. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ​చేశారు.  విద్యుత్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మెదక్​ సర్కిల్ ఆఫీసులో..

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం మెదక్ సర్కిల్ ఆఫీస్ ఎదుట విద్యుత్​ ఉద్యోగులు మహా ధర్నా   నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్​ఈ జానకిరాములు , ఏడీఈ మోహన్ బాబు, ఆయా యూనియన్ల నాయకులు  ప్రసాద్,  వేణు, వెంకటేశం,  తదితరులు పాల్గొన్నారు.