
ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదని.. సిగ్నలింగ్ పాయింట్ లో మార్పుల వల్లే ఈప్రమాదం జరిగిందన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంలో మార్పులు చేశారని.. ఆ మార్పుల వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని వెల్లడించారు. అశ్విని వైష్ణవ్ ఇవాళ ఉదయం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో కలిసి హాస్పిటల్ లో బాధితులను పరామర్శించారు
కవచ్ లేకపోవడం రైల్వే ప్రమాదానికి కారణం కాదని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సిగ్నలింగ్ పాయింట్ లో మార్పులు చేసిన వారిని గుర్తించామన్నారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిగ్నలింగ్ లో జరిగిన ట్యాంపరింగ్ పై నివేదిక సిద్ధమైందన్నారు.
ప్రమాదంతో దెబ్బ తిన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2023 జూన్ 7 ఉదయం లోపు ఈ పనులను పూర్తి చేసి ట్రాక్ పై మళ్లీ రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.