ఈసీఐఎల్‌‌‌‌ టెక్నికల్ ఆఫీసర్స్​

ఈసీఐఎల్‌‌‌‌ టెక్నికల్ ఆఫీసర్స్​

హైదరాబాద్‌‌‌‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ తయారీ కార్యకలాపాల్లో భాగంగా కాంట్రాక్ట్​ ప్రాతిపదికన 190 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

అర్హత: బీటెక్‌‌‌‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఏడాది పని అనుభవం ఉండాలి. ముంబయి, హైదరాబాద్, కైగా, రావత్‌‌‌‌భట, లఖ్‌‌‌‌నవూ, వైజాగ్, యాదాద్రిలో పని చేయాలి. 

సెలెక్షన్: డిగ్రీలో సాధించిన మార్కులు, సంబంధిత పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. 26, 28, 29 నవంబర్​లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

ఇంటర్వ్యూ వేదిక: ఫ్యాక్టరీ మెయిన్ గేట్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్‌‌‌‌ పోస్టు, హైదరాబాద్. పూర్తి సమాచారం కోసం www.ecil.co.in వెబ్​సైట్​లో చూసుకోవాలి.