
ఆంధ్ర సరిహద్దు హోసూరు ప్రాంతంలో ఏనుగుల దాడుల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. 15 రోజుల్లో ఏనుగు దాడిలో ముగ్గురు రైతులు చనిపోయారు. కృష్ణగిరి జిల్లా డెంకనికోట చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో వందల సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ఏనుగుల మందనుండి వేరుపడిన ఓ ఏనుగు గ్రామీణ ప్రాంతాలలో సంచరిస్తూ పొలంలో పనులు నిర్వహిస్తున్న వారిపై, పశువుల కాపారులపై దాడి చేస్తుంది. 15 రోజుల క్రితం తిమ్మరాయప్ప అనే రైతుపై దాడి చేసి చంపిన ఏనుగు.. రెండు రోజుల తర్వత చెన్నప్ప అనే మేకల కాపరిని హతమార్చింది. ఈ రెండు సంఘటనలు జరిగి 15 రోజులు కాక ముందే శుక్రవారం డెంకనికోట సమీపంలోని మేకలగౌనూరు గ్రామానికి చెందగిన శ్రీనివాస్ ను దాడి చేసి చంపేసింది.
పొలంలో పండించిన కూరగాయలను డెంకనికోట రైతు బజారుకు తీసుకెళ్తుండగా ఆప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు శ్రీనివాస్ పై దాడి చేసింది. ఈ సంఘటనలో శ్రీనివాస తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలో మృతిచెందాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 15 రోజుల్లో ముగ్గురిని పొట్టనపెట్టుకున్న ఏనుగు వల్ల డెంకనికోట ప్రాంతంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో మోస్తారు వర్షాలు కురవడంతో.. రైతులు వ్యవసాయ పనుల్లో ముమ్మరంగా ఉండాల్సిన తరుణంలో ఏనుగు వల్ల పొలం వద్దకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. వరుసగా ముగ్గురు రైతుల ప్రాణాలను హరించిన ఏనుగును పట్టి దూరప్రాంత అడవికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టక పోతే మరికొందరు రైతులు మృతువాత పడాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి రైతుల ప్రాణాలను తీసిన ఏనుగును పట్టి దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా
సీఎం కేసీఆర్‌పై అసభ్యకర పోస్టింగ్స్ చేసిన వ్యక్తి అరెస్టు