
తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ( అక్టోబర్ 10 ) రాత్రి జిల్లాలోని చంద్రగిరి మండలం యల్లంపల్లిలోకి ఏనుగుల గుంపు దూసుకొచ్చింది. పంట పొలాల్లోకి దూసుకొచ్చిన 7 ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పొలాల్లోని వరి, అరటి పంటలను ధ్వంసం చేశాయి ఏనుగులు. ఏనుగుల ఘీంకారాలతో గ్రామమంతా భయాందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు స్థానికులు.
ఏనుగులు భయంతో ఇంటి బయటకు రావాలంటే వణికిపోతున్నామని అంటున్నారు జనం. ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు గారమస్థులు. గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బాణసంచా సాయంతో ఏనుగులను తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.రాత్రి పూట జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు అధికారులు.