మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి హైవే దగ్గర.. అక్కన్నపేట అర్బన్ పార్క్  నేడే ఓపెనింగ్

మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి హైవే దగ్గర.. అక్కన్నపేట అర్బన్ పార్క్  నేడే ఓపెనింగ్

మెదక్, రామాయంపేట, వెలుగు: మెదక్– సిద్దిపేట– ఎల్కతుర్తి హైవే రామాయంపేట మండల పరిధి అక్కన్న పేట ఫారెస్ట్ ఏరియాలో అర్బన్‌‌‌‌‌‌‌‌ పార్క్ రెడీ అయింది. ఈ మార్గంలో వెళ్లే  వాహనదారులు సేద తీరేందుకు, జిల్లాలోని వివిధ మండలాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ పార్క్‌‌‌‌‌‌‌‌ ను ఏర్పాటు చేశారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం ఈ అర్బన్​ పార్క్​ను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగర వన యోజన పథకం కింద దీనిని ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద కింద రూ.2 కోట్లు మంజూరు అయ్యాయి. హైవే పక్కన ఉన్న ఫారెస్ట్ లో 50 హెక్టార్ల విస్తీర్ణాన్ని అర్బన్ పార్క్ డెవలప్ మెంట్ కోసం కేటాయించారు.

సందర్శకులు లోపలికి వెళ్లేందుకు హైవే పక్కనే ఆకర్షణీయంగా మెయిన్ ఎంట్రెన్స్ నిర్మించారు. అర్బన్ పార్క్ ఏరియా చుట్టూ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ నిర్మించారు. అడవి అందాలను తిలకించేందుకు వీలుగా ఎత్తైన వాచ్ టవర్, సందర్శకులు సేద తీరేందుకు ఆకర్షణీయమైన గజిబో నిర్మించారు. తాగునీటి వసతి, టాయిలెట్​సౌకర్యం కల్పించారు. ఈ అర్బన్ పార్క్‌‌‌‌‌‌‌‌ లో సఫారీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అక్కన్నపేట అర్బన్ పార్క్ దాదాపు పూర్తికాగా రామాయంపేట, మెదక్ పట్టణ వాసులకు, పరిసర మండలాల ప్రజలకు, మెదక్ నుంచి సిద్దిపేట, వరంగల్ రూట్‌‌‌‌‌‌‌‌లో నేషనల్ హైవే మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు అవకాశం కలిగింది. ఎండాకాలంలోనూ సైతం పచ్చదనం ఉండేలా అర్బన్​ పార్క్​ ఏరియాలో ఏపుగా పెరిగే స్థానిక రకాల చెట్లు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో జోజి తెలిపారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అర్బన్​ పార్క్​లోని ఖాళీ ప్రదేశాల్లో ఆయా మొక్కలు నాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పార్క్​ నిర్వహణకు సందర్శకుల నుంచి నామమాత్రం రుసుం వసూలు చేస్తామన్నారు.