Elon musk : ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్.. ఏది బెటర్?

Elon musk : ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్.. ఏది బెటర్?

సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో చాలా యాప్స్ ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ ప్లాట్ ఫామ్స్ గా మారాయి. యూజర్స్ కోసం రీల్స్, షార్ట్స్ తదితర ఫీచర్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ నెటిజన్లను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. దానికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

‘ఇన్ స్టాగ్రామ్ యూజర్లను డిప్రెషన్ లోకి పంపితే.. ట్విట్టర్ కోపాన్ని తెప్పిస్తుంది. ఈ రెండిట్లో ఏది బెటర్’ అని మస్క్ అడిగిన ప్రశ్నకు నెటిజన్ల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ట్విట్టర్ కొత్త నిర్ణయాల వల్ల పిచ్చెక్కుతుంద’ని కొందరంటే, ‘న్యూస్, కరెంట్ టాపిక్స్ అందించడంలో ట్విట్టర్ ముందుంటుంది. ట్విట్టర్ కే నా ఓటు’ అని మరికొందరు కామెంట్స్ పెట్టారు. ఇంకొందరు ‘ఇన్ స్టాగ్రామ్ ఎంటర్ టైన్ చేసినా, రోజు రోజుకి టిక్ టాక్ లా మారుతుంద’ని  అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ పోల్ లో అమెరికన్‌  ఫుట్‌బాలర్‌ టీజే మోయి, బెకర్‌ న్యూస్‌ సీఈవో కైలే బెకర్‌ స్పందిచడం విశేషం.