మస్క్.. ట్విట్టర్ యూజర్లకు ‘సారీ’ 

మస్క్.. ట్విట్టర్ యూజర్లకు ‘సారీ’ 

ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలను తగ్గించే ప్రయత్నంలో, కొత్త బాస్ ఎలోన్ మస్క్  త్వరలో కొత్త ఫీచర్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. "రోలింగ్ అవుట్ సూన్" అని మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌లో తెలిపాడు. ఈ ఫీచర్ వల్ల వివిధ సంస్థలకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లు ఫేక్, ఒరిజినల్ అకౌంట్స్ ని గుర్తించడానికి వీలు ఉంటుంది.

మరొక ట్వీట్ లో ట్విట్టర్ ‘యూజర్లందరికీ సారీ’ అంటూ పోస్ట్ చేశాడు. ఆదివారం కొన్ని దేశాల్లో ట్విట్టర్ సర్వర్ నెమ్మదించింది. దాంతో చాలామంది యూజర్లు లాగిన్ అవ్వక ఇబ్బంది పడ్డారు. నకిలీ అకౌంట్లు పెరిగిపోవడం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసినవాళ్లు కూడా బ్లూ టిక్ కోసం పేయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. వాటిని అరికట్టడానికి బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ని ట్విట్టర్ నిలిపివేసింది. ఈ రెండు కారణాలతో ట్విట్టర్ సర్వర్ కొంతసేపు స్లో అయింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపన చెప్తూ ట్వీట్ చేశాడు మస్క్.