ట్విట్టర్ నుంచి సోషల్ మీడియా ఖాతాలు తొలగింపు!

ట్విట్టర్ నుంచి సోషల్ మీడియా ఖాతాలు తొలగింపు!

ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, మస్టొడాన్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ట్విట్టర్ అకౌంట్లను తొలగించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ట్విట్టర్ ని వాడుకుంటూ ట్విట్టర్ తీరును విమర్శిస్తున్నాయని, వ్యతిరేక పోస్ట్ లు, క్రాస్-కంటెంట్ పోస్టింగ్‌కు పాల్పడుతున్నారని మస్క్ మండిపడ్డాడు. వాళ్ల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు ట్విట్టర్ ద్వారా ఉచిత ప్రమోషన్ అందుతుందటం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణమే.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లే కాకుండా పలు న్యూస్ చానల్స్ ఖాతాలు, తన వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టారని కొందరు జర్నలిస్ట్ ల అకౌంట్లను మస్క్ ట్విట్టర్ నుంచి తొలగించాడు. ఆ విషయంపై అనేక ప్రాతాలనుంచి ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు, జర్నలిస్ట్ సంస్థలు మస్క్ పై ఒత్తిడి తెచ్చాయి. ట్విట్టర్ పత్రికా స్వేచ్ఛను దెబ్బతీస్తుంని మండిపడ్డారు దాంతో మస్క్ తిరిగి వాళ్ల ఖాతాలను పునరుద్ధరించాడు