భయం భయంగా మస్క్.. ఆఫీస్కు బాడీగార్డులతో

భయం భయంగా మస్క్.. ఆఫీస్కు బాడీగార్డులతో

ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ట్విట్టర్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. మస్క్ నిర్ణయాలకు విసిగిపోతూ, వాటిని వ్యతిరేకిస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా మస్క్ చేసే పనుల్ని బయటి ప్రపంచానికి చెప్తుంటారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. మస్క్ ట్విట్టర్ ఆఫీస్ లోకి రావాలన్నా, బాత్ రూమ్ కి వెళ్లాలన్నా వెంట బాడీ గార్డ్స్ ను ఉంచుకుంటున్నాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

‘మస్క్ ట్విట్టర్ ఆఫీస్ కు వస్తే బాడీగార్డులు ఆయన చుట్టే ఉంటారు. మస్క్ ఉన్నంతసేపు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది. బాత్ రూమ్ కి వెళ్లేటప్పుడు ఇద్దరు బాడీగార్డులు ఆయన వెంట వెళ్తార’ని ఆ సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ తెలిపాడు. ‘మస్క్ కు ఉద్యోగులపై విశ్వాసం తక్కువ. ఎప్పుడూ భయపడుతుంటాడు. అందుకే సెక్యూరిటీని పెట్టుకొని తిరుగుతుంటాడ’ని వ్యాఖ్యానించాడు.