సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్.. డైరెక్ట్ మెసేజింగ్సిస్టమ్ను యూజర్ అవసరాలకు అనుగుణంగా మారుస్తూ వస్తోంది. అదే బాటలో మరో కొత్త ఫీచర్ యాడ్ చేసింది. చాట్ పేరుతో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ను అందించనుంది. ఎక్స్లోని ఈ చాట్ ఫీచర్ మామూలు మెసేజింగ్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది.
ఈ చాట్ ఫీచర్ ఉపయోగించి ఫైల్స్‌ను షేర్ చేయొచ్చు. వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు.. పంపిన మెసేజ్‌లను ఎడిట్ లేదా డిలీట్ చేయడం, మెసేజ్లు ఆటోమెటిక్‌గా డిజప్పియర్ అయ్యేలా సెట్ చేయడం వంటివి చేయొచ్చు.
ముఖ్యంగా ఎవరైనా చాట్‌లో స్క్రీన్‌షాట్ తీయడానికి ట్రై చేస్తే యూజర్లు నోటిఫికేషన్లను అందుకుంటారు. ఎక్స్లోని చాట్ ఫీచర్ ప్రైవసీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇది చాట్లు, ఫైల్ షేరింగ్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను అందిస్తుంది. మరీ ముఖ్యంగా సేఫ్ చాట్లలో ట్రాకింగ్, యాడ్స్ వంటివి ఏమీ ఉండవు. ప్రజెంట్ ఈ చాట్ ఫీచర్ ఐఓఎస్ డివైజ్‌లు, వెబ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా త్వరలోనే రానుంది.
