ఎలన్ మస్క్ .. అగర్వాల్ డిన్నర్ మీట్ : ఒక్క గంటలో నిప్పు కాదు పప్పు అని తేల్చాడా..!

ఎలన్ మస్క్ .. అగర్వాల్ డిన్నర్ మీట్ : ఒక్క గంటలో నిప్పు కాదు పప్పు అని తేల్చాడా..!

2022 అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని చేజిక్కించుకున్నాడు. కొత్త యజమానిగా అతని మొదటి దశల్లో ఒకటి అప్పటి-CEO పరాగ్ అగర్వాల్‌ను తొలగిం చారు. అతనితో పాటు, మస్క్ కంపెనీ ఇతర ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను కూడా తొలగించారు. చివరికి వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈరోజు X అని పిలవబడే ట్విట్టర్ అగర్వాల్ సీఈవోగా ఉన్నప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. అయితే పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవోగా పనికిరాడని.. అతను నిప్పు కాదు.. పప్పు అని ఒక్క డిన్నర్ మీట్ లోనే ఎలాన్ మస్క్ తేల్చేశాడని.. ఇది స్వయంగా ఎలాన్ మస్క్ బయోగ్రఫీలో పుస్తకంలోని సారాంశమని ప్రముఖ జర్నల్ వాల్ స్ట్రీట్ ప్రచురించింది.  

2023 సెప్టెంబర్ 12న ఎలాన్ మస్క్ బయోగ్రఫి పుస్తకం ఆవిష్కరణ జరగబోతోంది. ఈ పుస్తక రచయిత వాల్టర్ జాక్సన్.. అతను మూడు సంవత్సరాల పాటు స్టడీ చేశారు. అయితే మస్క్ బయోగ్రఫీ పుస్తకానికి సంబంధించి వివరణతోపాటు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ పై చేసిన వ్యాఖ్యలను వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. 

పుస్తకం సారాంశం ప్రకారం.. పరాగ్ అగర్వాల్, ఎలోన్ మస్క్ మార్చి 2022లో విందు కోసం కలుసుకున్నారు. మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. అప్పటి- ట్విట్టర్ సీఈఓతో సమావేశమైన తర్వాత మస్క్ ఇలా అన్నారట. అగర్వాల్ ఇలా నిజంగా మంచి వ్యక్తి..కానీ సీఈఓగా ఉండటానికి ఇది అవసరం లేదు. CEO కావాలంటే  ప్రజలు ఇష్టపడాల్సిన అవసరం లేదని మస్క్ అన్నాడట. 

అయితే సమావేశం తర్వాత ట్విట్టర్ స్టాక్ లను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు.. 2022 ఏప్రిల్ నాటికి అతిపెద్ద వాటాదారుగా మారాడు. దీంతోపాటు మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి ట్విట్టర్ విలువ 50 శాతానికి పైగా తగ్గింది. USD 44 బిలియన్లకు మస్క్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ఐదు నెలల తర్వాత, సోషల్ మీడియా సైట్ విలువ USD 20 బిలియన్లకు చేరుకుంది. ఈ పరిణామాల తర్వాత అక్టోబర్‌లో పరాగ్ అగర్వాల్‌ను తొలగించిన తర్వాత మస్క్ ట్విట్టర్ సీఈఓగా వ్యవహరించారు. కానీ 2023 జూన్‌లో మస్క్ ఆ పదవి నుండి వైదొలిగి లిండా యక్కరినో కు అప్పగించారు. 

X లో  ఏమి జరుగుతోంది?
ప్రస్తుతం మస్క్ ట్విటర్‌ను పూర్తిగా 'ఎవ్రీథింగ్ యాప్' ఎక్స్‌గా మార్చే దిశగా కృషి చేస్తున్నాడు. గత రెండు రోజుల్లో X  చాలా మార్పులను ప్రవేశపెట్టింది. త్వరలో మరికొన్ని మార్పులుంటాయని అంటున్నారు. ఆడియో, వీడియో కాల్‌లను పరిచయం చేయడం నుంచి డేటా సేకరణ , రాజకీయ ప్రకటన విధానాలలో మార్పుల వరకు చాలా మార్పులే జరిగాయి. మస్క్ ప్రకటించిన తాజా మార్పు ఏమిటంటే ట్విట్టర్ పోల్‌.. ఇందులో బ్లూ టిక్ సభ్యత్వం ఉన్న వినియోగదారులు  మాత్రమే పాల్గొంటారు. 'ట్విట్టర్ పోల్స్‌కు బాట్‌లు స్పామ్‌లు రాకుండా' ఇలా చేశామని మస్క్ ఇటీవల ఒక ట్వీట్‌లో లిపారు.