ఇక నుంచి ట్విటర్‌‌‌‌ అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉండదు : ఎలన్ మస్క్

ఇక నుంచి ట్విటర్‌‌‌‌ అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉండదు : ఎలన్ మస్క్

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: ఇక నుంచి ట్విటర్‌‌‌‌ అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉండదని టెస్లా బాస్ ఎలన్ మస్క్ పేర్కొన్నారు.  ‘ట్విటర్‌‌‌‌లో  ఏం చెప్పినా ఎటువంటి పరిణామాలు ఉండవు కాబట్టి చెల్లుతోంది. ఇక ట్విటర్ అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉండదు’ అని ఆయన వివరించారు.   మానవత్వం కోసమే  ట్విటర్‌‌‌‌ను కొనుగోలు చేశానని ఆయన అడ్వర్టయిజర్లకు రాసిన నోట్‌‌లో పేర్కొన్నారు.  కాగా, ట్విటర్‌‌‌‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో మస్క్ డీల్‌‌ కుదుర్చుకున్నారు. తర్వాత ఈ డీల్‌‌ నుంచి వెనక్కి తగ్గారు. దీనిపై ట్విటర్ కేసు వేయగా యూఎస్ కోర్టు  శుక్రవారం లోపు డీల్‌‌ను పూర్తి చేయాలని, లేకపోతే  నవంబర్‌‌‌‌లో  ట్రయల్ ఉంటుందని ఎలన్ మస్క్‌‌ను ఆదేశించింది. ఈ డెడ్‌‌లైన్‌‌కు ముందు రోజు ఆయన అడ్వర్టయిజర్లకు నోట్ పంపారు. ఫ్యూచర్ జనరేషన్స్‌‌ వివిధ రకాల నమ్మకాలపై ఎటువంటి గొడవులు లేకుండా  డిబేట్ చేసుకోవడానికి ఓ కామన్ డిజిటల్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ను అందించడానికే ట్విటర్‌‌‌‌ను కొనుగోలు చేశానని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా డేంజర్‌‌‌‌ అని, మనుషులను విడదీస్తుందని అన్నారు. ‘ మీ  బ్రాండ్‌‌లను, ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌లను  అడ్వర్టయిజ్ చేసుకోవడానికి ట్విటర్ ఒక గొప్ప వేదిక. మాతో పార్టనర్‌‌‌‌షిప్ కుదుర్చుకున్న వారిక థ్యాంక్స్’ అని ఆయన అడ్వర్టయిజర్లను ఉద్దేశించి పేర్కొన్నారు. వార్తల్లో వస్తున్నట్టు 75 శాతం మంది ట్విటర్ ఉద్యోగులను తీసేయనని ప్రకటిచారు.

ట్విటర్‌‌ కొనడానికి సింక్‌తో వచ్చిన ఎలన్ మస్క్‌

ట్విటర్‌ను ‌ కొనుగోలు చేయడానికి టెస్లా బాస్‌ ఎలన్‌ మస్క్ ట్విటర్ హెడ్‌ క్వార్టర్‌‌కు సింక్‌ (వాష్‌ బేసిన్‌)  పట్టుకొని వెళ్లారు. ‘ట్విటర్ హెడ్‌ క్వార్టర్‌‌లోకి ఎంటర్ అయ్యా. ఇది అందరికి అర్థం కాని (సింక్‌ ఇన్‌) ’ అంటూ ఆయన ట్విట్‌ చేశారు.  ఆయన తన ట్విటర్ బయోని ‘చీఫ్‌ ట్వీట్​’ గా మార్చారు.