
బ్రిటన్: వలసల కారణంగా బ్రిటన్ నాశనం అవుతున్నదని టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. మైగ్రేషన్తో హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు. బ్రిటన్ ప్రభుత్వంలో మార్పు రావాలని అనుకుంటున్నాను’’ అని మస్క్ అన్నారు.
బ్రిటన్‌లో ఆదివారం నిర్వహించిన ‘యాంటీ ఇమిగ్రేషన్’ ర్యాలీని ఉద్దేశించి మస్క్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘బ్రిటన్ ప్రభుత్వంలో భారీ సంస్కరణలు రావాలి. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి’’ అని ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు.