భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు బిలియనీర్ ఎలోన్ మస్క్ కూడా చేరారు.
భారతీయ వంటకాలకు, రుచులకు సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారడంతో, వివిధ దేశాల నుంచి ఎక్కువ మంది భారతీయ వంటకాలకు అభిమానులుగా మారుతున్నారు. ఇప్పుడు భారతీయ ఆహార ప్రియుల జాబితాలో బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా చేరిపోయారు.
ట్విట్టర్ యూజర్ డేనియల్ నోరూరించే బటర్ చికెన్, నాన్, రైస్.. చిత్రాన్ని పంచుకున్నారు. దాంతో పాటు ''నేను బేసిక్ b***h ఇండియన్ ఫుడ్‌ని ప్రేమిస్తున్నాను, ఇది చాలా చాలా బాగుంది'' అని క్యాప్షన్ లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పై మస్క్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ఇది 'నిజం' అని రిప్లై ఇచ్చారు. మస్క్ ఇచ్చిన ఈ రిప్లై నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ ఆహారాన్ని ప్రశంసించినందుకు గానూ చాలా మంది మస్క్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దాంతో పాటు భారతదేశానికి వచ్చి ఇతర వంటకాలను కూడా ప్రయత్నించమని ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుకి, మస్క్ ఇచ్చిన రిప్లైకి ఇప్పటికే 1.7 మిలియన్లకు పైగా వ్యూస్, 21వేల 4వందల లైక్‌లు, 1206 రీట్వీట్‌లు వచ్చాయి.
https://twitter.com/growing_daniel/status/1658285488086880257
