వికీపీడియా పేరు మారిస్తే.. రూ.8 వేల 300 కోట్లిస్తా : మస్క్

వికీపీడియా పేరు మారిస్తే.. రూ.8 వేల 300 కోట్లిస్తా : మస్క్

ఎలన్   మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఏదో ఒక ప్రకటనతో వార్తల్లో ఉంటున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్  వైరల్ గా మారింది. వికీపీడియా పేరు డికీపీడియాగా మార్చుకుంటే 1 బిలియన్ డాలర్లు( 8300 కోట్లు) ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.  అయితే  మస్క్ ఎందుకు అలా ట్వీట్ చేశారు వికీపీడియాను ఏమైనా కొనుగోలు చేస్తారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  అయితే మస్క్ అలా ఎందుకలా పోస్ట్ చేశారో  వివరణ ఇచ్చాడు. 

వికీపీడియా విరాళాల ద్వారా నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే  వికీపీడియా ఈజ్ నాట్ పర్ సేల్ అని గతంలో ఆ  సంస్థ  వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్  వికీపీడియా హోంపేజీలో పోస్ట్ చేసిన మెసేజ్ ను తన   ట్విట్టర్లో పోస్ట్ చేశారు మస్క్..  వికీపీడియా పౌండేషన్ కు అంత డబ్బు ఎందుకని ప్రశ్నించారు. ఈ డబ్బు ఖచ్చితంగా వికీపీడియా నిర్వహణ కోసం అయితే  కాదన్నారు. మీరు మీ ఫోన్ లో కూడా ఆ టెక్స్ట్ కాపీని రెడీ చేసుకోవచ్చని..ఇంకా డబ్బు దేనికని ప్రశ్నించారు. డబ్బును దేని కోసం ఉపయోగిస్తున్నారా అని చాలా మందికి సందేహాలున్నాయని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో వికీపీడియా పేజీకి ఆవు, ఆవుపేడలను యాడ్ చేయాలని కోరాడు .దీనికి వన్ మిలియన్ కు పైగా లైక్స్ రావడం విశేషం. 


దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. వికీపీడియాను కూడా కొని అప్ డేట్ గా మార్చాలని కొందరు కామెంట్ చేస్తున్నారు... మస్క్ చెప్పినట్టు బిలియన్ డాలర్లు తీసుకుని వికీపీడియా పేరును డికీపీడియాగా  పేరు మార్చి.. తర్వాత కొన్ని రోజులకు పాతపేరు పెట్టుకోవాలని ఓ నెటిజన్  సూచించాడు. దీనిపై స్పందించిన మస్క్.. తానేమి వెర్రివాన్ని కాదని.. కనీసం ఒక సంవత్సరం వికీపీడియా పేరు డికీపీడియాగా కొనసాగిస్తేనే డబ్బు ఇస్తానని కౌంటర్ ఇచ్చారు.