తగ్గిన ఎలాన్ మస్క్ సంపద.. రూ. 1.30 లక్షల కోట్లు ఆవిరి

తగ్గిన ఎలాన్ మస్క్ సంపద.. రూ. 1.30 లక్షల కోట్లు ఆవిరి

ఎంత డబ్బున్నా.. ఒక్కోసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  ప్రపంచ కుబేరుడిగా పేరొందిన ఎలాన్ మస్క్ సంపద ప్రస్తుతం భారీగా  క్షీణించింది.  టెస్లా షేర్ల పతనమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి.  దీంతో కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.  టెస్లా షేర్ల పతనంతో మస్క్ సంపద 16.1 బిలియన్ డాలర్లు అంటు దాదాపు లక్షా 30 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.  అయినప్పటికీ బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో  అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.  ఈ ఏడాది మస్క్ ఇప్పటివరకు 70 బిలియన్ డాలర్లు పెరిగింది. టెస్లాషేర్లు ఏకంగా 9.3 శాతం క్షీణించి 220.11 డాలర్ల వద్ద స్థిరపడింది.

ఎలాన్  మస్క్ కు  టెస్లా కంపెనీలో 13 శాతం వాటాలున్నాయి.  ఆయన సంపదలో అత్యధిక భాగం టెస్లా షేర్లదే.  ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని నిలబడేందుకు టెస్లా గత కొన్ని నెలల్లో కార్ల ధరలను భారీగా పెంచింది.  దీంతో కార్ల అమ్మకాలు తగ్గిపోవడవంతో   జులై-సెప్టెంబర్ త్రై మాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం క్షీణత నమోదైంది. ఈ ఆదాయం విశ్లేషకుల అంచనాలను కూడా  అందుకోలేకపోయింది.  

 టెస్లా షేర్లలో పతనం నమోదు కావడంతో ...   టెస్లా ఆర్థిక ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కోగలదని..  ఇప్పటివరకు  చెప్పిన మస్క్ ఫలితాల ప్రకటన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తీవ్రంగా ఉందని వ్యాఖ్యానించారు.  దీనివల్లే గిరాకీ నెమ్మదించిందని తెలిపారు.  ఎలాంటి సవాళ్లు  ఎదురైనా... కస్టమర్లకు అందించాల్సిన 1.8 మిలియన్ల కార్లను డెలివరీ చేసి తీరతామని టెస్లా తెలిపింది.