యూట్యూబర్కు సోనమ్‌ కపూర్‌ లీగల్ నోటీసులు..

యూట్యూబర్కు సోనమ్‌ కపూర్‌ లీగల్ నోటీసులు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌(Sonam Kapoor) ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంలో తరుచూ బయటికి వస్తోంది. తనపై వచ్చే రూమర్స్‌ కు, విమర్శలకు సోనమ్ రియాక్ట్ అవుతూ వస్తోంది. లేటెస్ట్ గా సోనమ్..ఓ యూట్యూబర్కు లీగల్ నోటీసులు పంపడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోనమ్ భర్త ఆనంద్ అహుజా(Anand Ahuja) ల కాస్ట్యూమ్స్‌ బ్రాండ్ల గురించి రాగిణి (Youtube Raginyy) అనే యూట్యూబర్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను..నోటీసులు పంపించారు సోనమ్. రీసెంట్గా రాగిణి చేసిన వీడియోలో..సోనమ్ కపూర్ అండ్ ఆనంద్ అహుజా ల కాస్ట్యూమ్స్ పై కామెడీ చేయడంతో వివాదం మొదలైంది.

గతంలో రాగిణి యూట్యూబ్ ఛానల్ కు7 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగ.. ఇక ఆ సంఖ్య ఒక్క రోజులోనే 37 వేలకు చేరుకుంది. దీంతో రాగిణి వేసిన జోకులు.. సోనమ్ వరకు చేరడంతో.. లీగల్గా యాక్షన్ తీసుకుంది..ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఈ మొత్తం విషయంపై యూట్యూబర్‌ రాగిణి వివరణ ఇస్తూ..నేను ఏ వీడియో చేసిన..ఎవ్వరిని టార్గెట్ చేయనని చెపుతూ..తను పెట్టె ప్రతి వీడియోలో ఒక నోట్‌ ఉంటుందని పేర్కోంది..'నేను చేస్తున్న వీడియో ఎవరినీ ఉద్దేశించినది కాదు. నాకు ఎవరిపై ద్వేషం లేదు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అని..వీడియో కింద రాసి ఉంటుందని రాగిణి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

ALSO READ : బీసీ కులాల మేనిఫెస్టో రిలీజ్.. పార్టీలకు దీన్ని అమలు చేసే దమ్ముందా..?

సోనమ్‌ కపూర్‌ యూట్యూబర్ రాగిణి కి నోటీసులు పంపించడంతో..నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. చిన్న యూట్యూబర్ పై ఎందుకు మీ ప్రతాపం..అంటూ విమర్శిస్తున్నారు. ఏదైనా పెద్ద షోల్లో మీరూ పాల్గొన్నప్పుడు స్టార్స్ ఎలాంటి కామెంట్స్‌ చేసినా నవ్వుతారు.అలాంటి  వాళ్లకు మాత్రం నోటీసులు పంపరు గానీ చిన్న యూట్యూబర్ పై ఎందుకింత రచ్చ..అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raginyy (@raginyy)