హైవే రోడ్​ ట్రిప్స్​ 

హైవే రోడ్​ ట్రిప్స్​ 

రోడ్​ ట్రిప్​ అనేది ఒక్కొక్కరికీ ఒక్కో ఎక్స్​పీరియెన్స్​ ఇస్తుంది. మన దేశంలో రోడ్డు ట్రిప్​కి వెళ్లాలే కానీ ఎన్నో అద్భుతాలను కళ్లారా చూడొచ్చు. ఆనందాలను మనసునిండా నింపుకోవచ్చు. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా ఏ రాష్ట్రంలోకి అడుగుపెట్టినా అందమైన ప్రకృతి పలకరింపు ఉంటుంది.  

లోయలు, పర్వతాలు, దట్టమైన అడవులు, సముద్రాలు... ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అద్భుతాలను కళ్ల ముందు నిలబెడుతుంది. అందుకే హైవే జర్నీ ప్లాన్​ చేయండి, జాతీయ, రాష్ట్ర హైవే ట్రిప్​లో సహజమైన అందాలను పలకరిస్తూ ప్రయాణం కానిచ్చేయండి. వీకెండ్స్​లో షార్ట్​ ట్రిప్​కి వెళ్లాలన్నా, లాంగ్ అడ్వెంచర్​ జర్నీ చేయాలన్నా మంచి ఎక్స్​పీరియెన్స్​ దొరుకుతుంది.

అందమైన హైవే రోడ్లలో కొన్ని ఇవి...

రామేశ్వరం నుంచి పంబన్​ బ్రిడ్జి : ఇండియాలోనే అద్భుతమైన హైవే ఇది. రామేశ్వరం నుంచి పంబన్​ బ్రిడ్జి జర్నీ షార్ట్​ రూట్​. కానీ ఈ జర్నీ చేసిన వాళ్లు జీవితంలో మర్చిపోలేరు. హిందూ మహాసముద్రం​ మీద డ్రైవ్​ చేస్తుంటే ఆ నీళ్లు చూసే కళ్లను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. దాని పక్కగా వెళ్లే రైల్వే ట్రాక్ చూస్తుంటే గమ్మత్తయిన ఫీలింగ్​ కలుగుతుంది. ఈ ట్రిప్​ కచ్చితంగా మర్చిపోలేని అనుభూతులను ఇస్తుంది​. ఈ బ్రిడ్జి ఆర్కిటెక్చర్​ కూడా చాలా బాగుంటుంది. దానిపక్కగా వెళ్తున్న రైల్వేలైన్​లో ఒక అందం కనిపిస్తుంది. బ్రిడ్జి పొడవు 2.2 కిలోమీటర్లు. రామేశ్వరం నుంచి పంబన్​ బ్రిడ్జి ప్రయాణం13.4 కిలోమీటర్లు.

ముంబయి నుంచి గోవా: ముంబయి నుంచి గోవా రోడ్డు జర్నీ కనులకు విందు చేస్తుంది. కొండలు, లోయలు, జలపాతాలను చూస్తూ సముద్రం పక్కగా సాగే జర్నీ ఇది. కొల్హాపూర్​లో కొంచెంసేపు ఆగి... అక్కడినుంచి పార్టీ కాపిటల్​ గోవా వైపుకు జర్నీ మొదలుపెట్టొచ్చు. ఈ మొత్తం ప్రయాణం 590 కిలోమీటర్లు.

మనాలి నుంచి లెహ్: అడ్వెంచర్​ ఇష్టపడేవాళ్లు మనాలి నుంచి లెహ్​ జర్నీని అంతే అడ్వెంచరస్​గా ఎంజాయ్​ చేయడం ఖాయం. పర్వతాలు శ్రేణులు, ​ తాల్​ వంటి అందమైన సరస్సులు.... చాలా బాగుంటాయి. మనసుకు గట్టిగా హత్తుకుపోతుంది. ఈ ప్రయాణ దూరం 427 కిలోమీటర్లు. అయితే బాగా మంచు కురిస్తే మాత్రం ఈ హైవే మూసేస్తారు. అందుకని ప్లాన్​ చేసేముందు అక్కడి వాతావరణం గురించి తెలుసుకోవడం బెటర్​.

చెన్నయ్​ నుంచి పాండిచ్చేరి : దీన్నే ఈస్ట్​ కోస్ట్​ రోడ్​ అంటారు. సముద్రతీరం వెంబడి చేసే సుందరమైన జర్నీ. సముద్రం మీద నుంచి వచ్చే సన్నటి చలిగాలులు, పైన్​ చెట్లు, గమ్మత్తైన అనుభవాన్ని అందించే ఉప్పు సముద్రం ఆహ్లాదకరమైన డ్రైవ్​ ఎక్స్​పీరియెన్స్​ మిగులుస్తాయి. ఇది 152 కిలోమీటర్ల జర్నీ.

బెంగళూరు నుంచి ఊటీ: ప్రకృతి ప్రేమికులకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం ఇది అని చెప్పొచ్చు. తాజా, పచ్చిక గాలి​, ఆకుపచ్చటి తివాచీలు పరిచినట్టు ఉండే వ్యూ చూసి తీరాల్సిందే. ఈ రోడ్డు జర్నీలో36 హెయిర్​పిన్​ బ్లెండ్స్​, పెద్ద చెట్లు, ప్రకృతి ఫిల్టర్​ చేసిన సూర్యకిరణాలు, పూలు అన్నీ అద్భుతాలే అంటే అతిశయోక్తి కాదు. ఇండియాలోనే స్టన్నింగ్​ హైవే ట్రిప్ అవుతుంది ఇది. మొత్తం​ 265 కిలోమీటర్ల జర్నీ.

విశాఖపట్టణం నుంచి అరకు వ్యాలీ: ఈ హైవే జర్నీలో టౌన్​లు, గ్రామాలు పలకరిస్తాయి. అరకు వ్యాలీ చేరుకునేలోపు ఫొటోలు తీసుకునేందుకు ఆగకుండా జర్నీ పూర్తి కాదు. ఈ జర్నీ దూరం115 కిలోమీటర్లు.
ముంబయి నుంచి పుణె ఎక్స్​ప్రెస్​ వే : వెస్టర్న్​ ఘాట్స్​నుంచి సాగే ఎంతో అందమైన ప్రయాణం. మంచును కప్పుకున్న ఆకాశం, వెడల్పాటి రోడ్లు, ఆకుపచ్చటి అందాలతో పాటు రోడ్డు పక్కన ఉండే తినుబండారాలు హైవే జర్నీ అలసటను తెలియనీయవు. అంతేకాదు మళ్లీ ఒకసారి హైవే జర్నీ అని మనసు అడిగేలా చేస్తుంది. ఈ దూరం148 కిలోమీటర్లు గ్యాంగ్​టక్​ నుంచి లేక్​ ట్సోమ్ గో, నాథు లా పాస్ : ఇండియాలోని ఈశాన్య​ ప్రాంతంలో గ్యాంగ్​టక్​ నుంచి లేక్​ ట్సోమ్​గో, నాథు లా పాస్​ థ్రిల్లింగ్​ రైడ్​ ఒక ఛాలెంజ్​.

 జీవితంలో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాలి. ప్రకృతి అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ ప్రయాణ దూరం 40 కిలో మీటర్లు.షిల్లాంగ్​ నుంచి షోర వరకు (చిరపుంజి) : ఈశాన్య రాష్ట్రాల్లోనే మరో అందమైన జర్నీ షిల్లాంగ్​ నుంచి సోహ్ర(చిరపుంజి) దారి. ఈ హైవేలో ప్రయాణం చాలాసార్లు మంచుతో స్వాగతం చెప్తుంది. మంచు పడుతున్నా, రోడ్డు క్లియర్​గా ఉన్నా ఇక్కడి అందాలు ఊపిరి తీసుకోకుండా చూస్తూ ఉండిపోతారు. దీని దూరం 54 కిలోమీటర్లు.

చండీగఢ్ నుంచి కసోల్​: హైకర్స్​, అడ్వెంచర్​ ఇష్టపడేవాళ్లకు కసోల్​ బెస్ట్​ ప్లేస్​ అని చెప్పాలి. రోడ్డు ట్రిప్​కి​ కూడా ఇది పాపులర్​ డెస్టినేషన్​. ఈ ప్రయాణం దారంతా మాటల్లో వర్ణించలేని అందాలు. దీని ప్రయాణ దూరం 280 కిలోమీటర్లు.

ప్లానింగ్​ ఇలా...

హైవే లాంగ్​ ట్రిప్​ ప్లాన్​ చేసినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే... ఎన్ని రోజులు ట్రిప్​ అనేదాన్ని బట్టి డెస్టినేషన్స్​ సెలక్ట్​ చేసుకోవాలి. ఇటినరీ ప్లానింగ్​ ముఖ్యం. బెస్ట్​ రూట్​చూసుకుని, ఎక్కడ రెస్ట్​ స్టాప్స్​ పెట్టుకోవాలి. హోటల్​ బుకింగ్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలి. అక్కడ చేయాల్సిన యాక్టివిటీలు ఏమన్నా ఉన్నాయా? అనే విషయాలను ప్లాన్​ చేసుకోవాలి. ఇలా ప్లాన్​ చేయడం వల్ల బడ్జెట్​ చేయి దాటిపోకుండా ఉంటుంది. ప్లాన్​ బట్టి టూర్​ ఉంటే ‘అయ్యో’ అనుకోవాల్సిన పరిస్థితులు ఎదురుకావు.

అలాగే కొన్ని స్నాక్స్​, వాటర్​ తీసుకెళ్లడం తప్పనిసరి. ప్లేలిస్ట్ తయారుచేసుకుని ఆ పాటలు డౌన్​లోడ్​ చేసుకోవాలి. ఎంటర్​టైన్​ చేసే యాక్టివిటీలు ఇంకేవైనా... గేమ్స్​, సినిమాలు వంటివి పట్టుకెళ్లొచ్చు. సైట్​ సీయింగ్​ ప్లాన్​ చేసుకోవచ్చు. వీటన్నింటికంటే ముందు చూసుకోవాల్సింది వెహికల్​ కండిషన్​. ఎప్పటికప్పుడు సర్వీస్​ చేయించుకోవాలి. స్పేర్​టైర్​ చెకప్​ కూడా చేయించాలి.  రోడ్​సైడ్​ అసిస్టెన్స్​ కాంటాక్ట్​ నెంబర్స్​ రాసుకోవాలి. స్పీడ్​ లిమిట్స్​ దృష్టి పెట్టుకుని డ్రైవ్​ చేయాలి. డ్రైవింగ్​ చేసేటప్పుడు ధ్యాస రోడ్డు మీద ఉండటం కంటే సేఫ్టీ టిప్​ ఏముంటుంది?

  • కొన్ని వెహికల్స్​లోనే నావిగేషన్​ సిస్టమ్​ ఉంటోంది. అది ఉన్నా కూడా స్మార్ట్​ఫోన్​లో జిపిఎస్​ లేదా యాప్స్​లో ఉండే మ్యాప్స్​ చూసుకోవడం బెటర్​.
  •  పిల్లలతో జర్నీ చేస్తుంటే కలరింగ్​ పుస్తకాలు, స్నాక్స్​ తీసుకెళ్లాలి. ఇవి వాళ్లకి ఎంటర్​టైనింగ్​గా ఉంటాయి. వాటితోపాటు మధ్యలో ఆగేందుకు సఫిషియెంట్​ టైం పెట్టుకోవాలి.
  •  కార్​ మాన్యుఫాక్చర్​ రోడ్​ సైడ్ అసిస్టెన్స్​ ఫోన్​ నెంబర్​ ఉండాలి. అలాగే హెల్త్​ ఇన్సూరెన్స్​ కూడా అవసరం. పొరపాటున ఏవైనా ప్రమాదాలు జరిగితే అవి పనికొస్తాయి. వెహికల్​ బ్రేక్​ డౌన్​ అయితే ఎమర్జెన్సీ లైట్స్​ యాక్టివేట్​ చేయాలి. వెంటనే రోడ్డు మీద నుంచి వెహికల్​ను కిందకు దింపి ఎమర్జెన్సీ బ్రేక్స్​ వేయాలి. సాయం అందేవరకు వెహికల్​లోనే ఉండాలి.