మీ ర్యాంకుకు ఏ కాలేజ్​? ఎంసెట్​ కౌన్సెలింగ్​ గైడ్​

మీ ర్యాంకుకు ఏ కాలేజ్​? ఎంసెట్​ కౌన్సెలింగ్​ గైడ్​

ఎంసెట్​లో ర్యాంకు వచ్చిందా.. మీ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటొస్తుంది..ఏ కాలేజ్​ మంచిగుంది? రాష్ట్రంలో టాప్​ కాలేజీలు ఎక్కడున్నాయి..? ఏ కాలేజీలో లాస్ట్​ ర్యాంక్​ ఎంత? మీ కోసం గత ఏడాది ఎంసెట్​ ర్యాంకుల విశ్లేషణను ప్రత్యేకంగా అందిస్తున్నాం. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సీట్లు, టాప్​ కాలేజీలు, ఫేవరెట్​ బ్రాంచ్​లు, లాస్ట్​ ర్యాంక్‌లు, వెబ్​ కౌన్సెలింగ్​ ప్రక్రియ, సీట్ల కేటాయింపు తదితర వివరాలు…

జూన్​ 20 తర్వాత ఇంజనీరింగ్​, అగ్రికల్చర్​ కోర్సులకు కౌన్సెలింగ్​ ప్రారంభమవుతుంది. ఇంటర్ ఫలితాల వివాదం నేపథ్యం లో రీవెరిఫికేషన్ ఫలితాలు వచ్చే దాకా వేచి చూసిన ఉన్నత విద్యామండలి ఇంటర్ మార్కు లకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాం కులు కేటాయించింది. ఈసారి ఎంసెట్‌‌కు 2,17,199 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,42,210 మంది ఇంజినీరింగ్, 74,989 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,31,209 మంది హాజరవగా 82.47 శాతం అంటే 1,08,213 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫా ర్మసీ పరీక్షల్లో 68,550 మందికి గాను 93.01 శాతం (63,758 మంది) అర్హత పొందారు. కాబట్టి ఇంజినీరిం గ్ కౌన్సెలింగ్‌‌పై అభ్యర్థులకు కనీసం అవగాహన ఉంటే నచ్చిన కాలేజీలో, ఫేవరెట్ బ్రాంచ్ లో అడ్మిషన్ పొందవచ్చు.

టాప్ కాలేజీలు

జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఓయూ  చైతన్య భారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజ్ఞాన్ జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ బీవీ రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్​_వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గోకరాజు గంగరాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధారం: నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్

సీట్ల విషయంలో అస్పష్టత

రాష్ట్రంలో 2018–19 అకడమిక్ ఇయర్ లో 228 ఇంజినీ రిం గ్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు 1,14,117. అదే 2017–18 సంవత్సరానికి 242 కాలేజీల్లో ఉన్న సీట్లు 1,24,239. అంటే దాదాపు 10 వేలకు పైగా సీట్లకు కోత పడిం ది. ఈ సంవత్సరం కూడా ఇంజినీరింగ్ సీట్లు తగ్గొచ్చని సమాచారం. ఉన్నత విద్యామండలి ఇటీవల ఏఐసీటీఈ అనుమతి పొందిన ఇంజినీరింగ్‌‌ కళాశాలల సంఖ్య 214గా ఉన్నట్లు, వాటిలో సీట్ల సంఖ్య 1,08,715 కు చేరిం దని వెల్లడించిం ది. కానీ 90 వేల సీట్లకు మాత్రమే కౌన్సెలిం గ్ ఉంటుందని ప్రచారం జరుగుతోం ది. అలాగే రాష్ట్రంలోని యూనివర్శిటీ, వాటికి అనుబంధంగా ఉన్న 14 కళాశాలల్లో దాదాపు 3,055 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

వెబ్ సైట్: www.sbtet.telangana.gov.in

సీట్ల భర్తీ ఇలా..

ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రధానంగా కన్వీనర్ కోటా, మేనేజ్‌ మెం ట్ కోటా అనే రెం డు రకాల సీట్లు ఉంటాయి. ప్రభుత్వ కాలేజీల్లో ని అన్ని సీట్లను (కన్వీనర్ కోటా) ఎంసెట్ ర్యాం క్ ద్వారా ఆన్ లైన్ కౌన్సెలిం గ్ నిర్వహిం చి ప్రభుత్వమే భర్తీ చేస్తుం ది. మేనేజ్​మెం ట్ సీట్లలో 70 శాతం కన్వీ నర్ కోటాగా పరిగణించి ప్రభుత్వమే భర్తీ చేస్తుం డగా మిగిలిన 30 శాతం సీట్లను బి –కేటగిరీ పేరుతో ఆయా కాలేజీల యాజమాన్యాలు భర్తీ చేసుకుం టాయి. ఇందులో

15 శాతం సీట్లు ఎన్ ఆర్ ఐ కోటా కిం ద కేటాయిస్తారు. అంటే వీటికి ఎంసెట్ ర్యాం క్ అవసరం లేదు. ఈ కోటా కిం ద ప్రవాస భారతీయుల పిల్లలు ఇంటర్ లో కనీసం 50 శాతం మార్కు లు సాధిస్తే నేరుగా అడ్మిషన్ పొం దవచ్చు. కౌన్సెలిం గ్ తర్వాత మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తుం డగా చివరి వరకు మిగిలిన సీట్లను ఎంపీసీలో 45 శాతం మార్కు లు పొం దిన వారికి కేటాయిస్తారు.

కౌన్సెలింగ్ విధానం

అభ్యర్ థులు వెబ్ కౌన్సెలిం గ్ లో జాగ్రత్తగా వ్యవహరిం చాలి. ముం దుగా హాల్ టికెట్ నంబర్ , రిజి స్ర్టేషన్ నంబర్ తో ఆన్ లైన్ లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం వెబ్ సైట్ లో వచ్చే కాలేజీలు, బ్రాంచ్ వివరాలను సరిచూసుకొని ప్రిఫరెన్స్​ ఆర్డర్ ఇచ్చుకోవాలి. వీలైనన్ని ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సీటు అలాట్ అవకాశం ఉంటుం ది. అప్షన్ల గడువుముగిసిన తర్వాత అభ్యర్థి ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సీటు పొం దిన వారు కాలేజీలో రిపోర్ట్​ చేయాలి. తొలిదశలో సీటు పొం దిన వారు దానికి ఆమోదం తెలపక పోతే రెం డో దశలో తాజా అభ్యర్థిగా పరిగణిస్తా రు. సీటు, కాలేజీ నచ్చకపోయినా రెండో దశలో అందుబాటులో ఉండే స్లైడిం గ్ ఆప్షన్ ద్వారా మార్చు కోవచ్చు.