బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్ ధర రూ.8వేల800

బరువు తగ్గించే  ఈ ఇంజెక్షన్ ధర రూ.8వేల800


న్యూఢిల్లీ: పుణెకు చెందిన ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఊబకాయం నివారణ కోసం పోవిజ్ట్రా పేరుతో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. నోవో నార్డిస్క్ సంస్థకు చెందిన ఈ మందును దేశీయంగా పంపిణీ చేసేందుకు ఎంక్యూర్ ఒప్పందం చేసుకుంది. ఈ ఇంజెక్షన్ వారానికి ఒకసారి తీసుకోవాలి . నెలవారీ కోర్సు ధర రూ.8,790 నుంచి ప్రారంభం కానుంది. ఇది 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు ఐదు రకాల డోసేజీల్లో లభిస్తుంది.