నాగార్జునసాగర్ ప్రాజెక్టులో మళ్లీ ఎమర్జెన్సీ మోటార్లు

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో మళ్లీ ఎమర్జెన్సీ మోటార్లు

నల్గొండ, వెలుగు: హైదరాబాద్​ మహానగర తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్న మెట్రోవాటర్​ స్కీం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఎస్ఎల్​బీసీ (శ్రీశైలం లెఫ్ట్​బ్యాంక్​ కెనాల్) నుంచి గ్రావిటీ ద్వారా హైదరాబాద్​కు వాటర్​ తీసుకునే అవకాశం ఉండగా, సుంకిశాల దండగ అని అప్పట్లో కాంగ్రెస్​ నేతలతో పాటు బీఆర్ఎస్​ నేతలూ విమర్శించారు. 

సాగర్​లో మళ్లీ ఎమర్జెన్సీ మోటర్లు

బీఆర్ఎస్​ సర్కారు వల్ల అటు ఎస్ఎల్​బీసీ, ఇటు సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో తాజాగా హైదరాబాద్​తాగునీటి అవసరాల కోసం రూ.4  కోట్లతో పుట్టంగండి వద్ద  ఆఫీసర్లు ఎమర్జెన్సీ మోటర్లు ఏర్పాటు చేశారు.  ప్రస్తుతం సాగర్​లో 509 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం కృష్ణాలో  తాగునీటి అవసరాల కోసం 8.5 టీఎంసీలు తెలంగాణకు, 5.5 టీఎంసీలు ఏపీ వాడుకునేందుకు కేఆర్ఎంబీ అనుమతిచ్చింది. 

ఈ లెక్కన సాగర్​ నుంచి ఏపీ వాటర్​ డ్రా చేస్తే  నీటి మట్టం 506 అడుగులకు పడిపోతుంది. అప్పుడు  హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు తాగునీటి అవసరాలకు ఉన్న లిఫ్టులకు నీళ్లందే పరిస్థితి ఉండదు. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు పెట్టి పీఏపల్లి వద్ద 600 హెచ్​పీ కెపాసిటీ కలిగిన ఐదు మోటర్లు,300 హెచ్​పీ కలిగిన మరో 5 మోటర్లు ఏర్పాటు చేస్తున్నది. వీటిద్వారా సాగర్​ నీటి మట్టం 500 అడుగులకు పడి పోయేదాక నీటిని తోడుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎల్​బీసీ పూర్తికావడమే నల్గొండ, హైదరాబాద్​తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.