మారటోరియం పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

మారటోరియం పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలపై మరోసారి మారటోరియం అవకాశం కల్పించాలంటూ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల దేశ వ్యాప్తంగా రెండోసారి లాక్ డౌన్ విధించారని.. దీని వల్ల అనేక మంది ఇబ్బందిపడుతున్న దృష్ట్యా రుణాలపై మరోసారి మారటోరియం విధించాలని కోరుతూ వేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మారటోరియం విధించమని చెప్పడం మా పని కాదు.. అది పూర్తి విధానపరమైన నిర్ణయమని, ప్రభుత్వాలే తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిది. ఇలాంటి అంశాలపై పరిస్థితిని ప్రభుత్వాలే మానవత్వంతో సమీక్షించి తగిన ఉత్తర్వులను జారీ చేస్తే మంచిదని సుప్రీం కోర్టు పేర్కొంది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ విధించిన సమయంలో రుణాలపై ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. అలాంటి మారటోరియం ఈసారి కూడా కావాలని కోరుతూ కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు.