5 ఏళ్లు పనిచేయకున్నా ప్రమోషన్లు, శాలరీ హైక్‌లు!

5 ఏళ్లు పనిచేయకున్నా ప్రమోషన్లు, శాలరీ హైక్‌లు!

కష్టపడి జాబ్ చేస్తే గాని శాలరీ హైక్‌‌లు, ప్రమోషన్లు ఉండవు. కానీ, ఓ ఉద్యోగికి మాత్రం జాబ్‌‌లో జాయినయిప్పటి నుంచి గత వారం వరకు  పనిచేయకపోయినా ప్రమోషన్లు, శాలరీ హైక్‌‌లు అందాయి. రెడ్‌‌ఇట్‌‌లో ‘డార్కెస్ట్ వర్క్ సీక్రెట్‌‌’ కింద తన సీక్రెట్‌‌ను పంచుకున్నారు ఓ గుర్తు తెలియని ఉద్యోగి.  ‘2015 లో డేటా ఎంట్రీ జాబ్‌‌లో జాయిన్ అయ్యా. ఇది వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ జాబ్‌‌. షిఫ్ట్‌‌లు మాత్రం దారుణంగా ఉండేవి. వర్క్‌‌ ఏంటంటే,  ఆర్డర్‌‌‌‌కు సంబంధించిన మెయిల్ ఒకటొస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్‌‌ను సిస్టమ్‌‌లో ఎంట్రీ చేయాలి. కంపెనీ ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌ ఖర్చులను తగ్గించుకోవడానికి మొదటి రోజు నుంచి వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌ విధానంలోనే పనిచేయించింది’ అని ఈ ఉద్యోగి పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ జాబ్‌‌ను ప్రోగ్రామింగ్‌‌ (కోడ్‌‌) కూడా చేస్తుందని అర్థమయ్యిందన్నారు. తనకు కోడింగ్ రాయడం రాదని, కానీ, ఫ్రీలాన్సర్‌‌‌‌తో  ఓ కోడింగ్‌‌ను క్రియేట్ చేశానని చెప్పారు. తన రెండు నెలల శాలరీని  ఈ ఫ్రీలాన్సర్‌‌‌‌కు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ‘మొదటి రెండేళ్లు కోడింగ్ నా వర్క్‌‌ను కరెక్ట్‌‌గా చేస్తుందా? లేదా?  అని చెక్ చేస్తుండేవాడిని. ఇది కూడా మహా అయితే 5 నిమిషాలు పట్టేది. ఆ తర్వాత కంప్యూటర్‌‌‌‌కు వర్క్ అప్పగించి సినిమాలు చూసుకునేవాడిని. పడుకునేవాడిని’ అని ఈ ఉద్యోగి రెడ్‌‌ఇట్‌‌లో షేర్ చేసుకున్నారు. ఎక్స్‌‌లెంట్‌‌గా పనిచేస్తున్నందుకు కొన్ని సార్లు ప్రమోషన్ ఆఫర్స్‌‌ కూడా వచ్చాయని గుర్తు చేసుకున్నారు. వేరే కంపెనీల్లో కూడా ఆఫర్స్ వచ్చాయని చెప్పారు. తాజాగా తను చేసే వర్క్‌‌ను భర్తీ చేయడానికి ప్రోగ్రామ్‌‌ను డెవలప్ చేశారని ఈ ఉద్యోగి చెప్పారు. ‘కొన్ని వారాల క్రితం నా సెవెరన్స్ చెక్‌‌ను అందుకున్నా. ల్యాప్‌‌టాప్‌‌ను, ఎక్విప్‌‌మెంట్‌‌ను ఆఫీస్‌‌వాళ్లు ఉంచుకోమన్నారు. కంపెనీలో ఏ పొజిషన్‌‌లోనైనా జాయిన్ కావాలంటే అప్లయ్ చేసుకోమని చెప్పారు. ఈ కోడ్‌‌ గురించి ఎవరికీ తెలియదు. నా ఫ్యామిలీకి కూడా తెలియదు. నా భార్యకు కూడా నేను ఈ కంపెనీలో ఏం చేస్తున్నానో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇది ముగిసింది. ఇదే నా డార్కెస్ట్ సీక్రెట్‌‌’ అని ఈ  ఉద్యోగి రెడ్‌‌ఇట్‌‌లో పంచుకున్నారు.