ఆఫీస్ వద్దు..వర్క్ ఫ్రమ్ హోమే బెటర్

ఆఫీస్ వద్దు..వర్క్ ఫ్రమ్ హోమే బెటర్

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: కరోనా వలన వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌కు అలవాటుపడిన ఉద్యోగులు, తిరిగి ఆఫీస్‌‌‌‌లకు రావడానికి ఇబ్బందిగా ఫీల్‌‌‌‌ అవుతున్నారు.  వర్‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్ హోమ్‌‌‌‌ వాతావరణానికి అలవాటుపడ్డామని,  ఆఫీస్‌‌‌‌లకు వస్తే అక్కడి వాతావరణానికి తిరిగి అడ్జెస్ట్ అవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతుండడంతో ఉద్యోగులు తిరిగి ఆఫీస్‌‌‌‌లకు రావాలని కంపెనీలు ఆదేశిస్తున్నాయి. వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోం విధానంతో వర్క్‌‌‌‌–లైఫ్‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌ను ఉద్యోగులు మేనేజ్‌‌‌‌ చేయడం మెరుగుపడింది. ఆఫీస్‌‌‌‌లకు తిరిగి రావడంలో కంపెనీల హెచ్‌‌‌‌ఆర్ డిపార్ట్‌‌‌‌మెంట్లకు ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత వస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు.  ‘ప్రస్తుత పరిస్తితులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. కరోనా పాజిటివిటీ రేటును పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటాం’ అని మారికో చీఫ్‌‌‌‌ హ్యూమన్ రిసోర్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ (సీహెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఓ) అమిత్ ప్రకాశ్‌‌‌‌ అన్నారు. కిందటేడాది ఆఫీస్‌‌‌‌లు తిరిగి ఓపెన్ అయినప్పుడు ఉద్యోగుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదని తెలిపారు.  ఆ టైమ్‌‌‌‌లో కొంత ఆశ్చర్యానికి కూడా గురయ్యామని అన్నారు. తిరిగి ఆఫీస్‌‌‌‌లకు వస్తే ఉద్యోగులు చాలా విషయాల్లో రీ–అడ్జెస్ట్‌‌‌‌ అవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ‘మనం ఇంకా సాధారణ స్థాయికి తిరిగి రాలేదు. స్కూళ్లు, పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. రిమోట్ వర్కింగ్ పరిస్థితులను అడ్వాంటేజ్‌‌‌‌గా వాడుకోవడంపై నిర్ణయం తీసుకుంటాం’ అని  మహీంద్రా సీహెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఓ రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ త్రిపాఠి అన్నారు. 

ఉద్యోగుల కోసం హైబ్రిడ్ విధానం..

కంపెనీలు ప్రతి రోజు 20–25 శాతం స్టాఫ్‌‌‌‌తో ఆఫీస్‌‌‌‌లను ఓపెన్ చేస్తున్నాయి. సీనియర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా ఆఫీస్‌‌‌‌లకు రావాలనుకుంటే రావొచ్చని చెబుతున్నాయి. కానీ, మిడ్ లెవెల్‌‌‌‌ ఉద్యోగులే ఆఫీస్‌‌‌‌లకు రావడంపై కొంత ఇబ్బంది పడుతున్నారు. రిమోట్ వర్కింగ్ చేసే ఉద్యోగుల్లో కొంత మంది ఏ గోవాలోనో, గుజరాత్‌‌‌‌లోనో లేక ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. ఆఫీస్‌‌‌‌లకు తిరిగి రమ్మంటే మళ్లీ  రీ–అడ్జెస్ట్ అవ్వాలని వాపోతున్నారు. మహీంద్రా, మారికో వంటి పెద్ద కంపెనీలు  ఆఫీస్‌‌‌‌లను దశల వారీగా తిరిగి ఓపెన్ చేస్తున్నాయి. ‘రిమోట్ వర్కింగ్‌‌‌‌లో  ప్రైవసీ ఉంటుంది. కంఫర్టబుల్‌‌‌‌గా ఫీల్ అవుతారు. ట్రావెల్ టైమ్‌‌‌‌ కూడా సేవ్ చేసుకోవచ్చు. అందుకే ఈ విధానంలోనే వర్క్ కొనసాగాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. మరికొంత మంది ఉద్యోగులు మాత్రం తిరిగి ఆఫీస్‌‌‌‌లకు వెళితే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకే కంపెనీలు హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌‌‌‌ను తీసుకురావాలని చూస్తున్నాయి. ఉద్యోగులకు ఫ్లెక్సిబులిటీ ఇచ్చి, వారిని సంతోషంగా ఉంచాలని చూస్తున్నాయి’ అని హ్యాపినెస్‌‌‌‌ డాట్ మీ ఫౌండర్ రాజ్‌‌‌‌ నాయక్‌‌‌‌ పేర్కొన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు హైబ్రిడ్ విధానానికి మారినా, ఫిజికల్ ఆఫీస్‌‌‌‌లు చాలా కీలకమని టాటా సన్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఎన్‌‌‌‌ చంద్రశేఖరన్‌‌‌‌ అభిప్రాయపడ్డారు. ఇతరులతో కలవడానికి ఆఫీస్‌‌‌‌లు కీలకమని, ఇక్కడే నిజమైన  కొలాబరేషన్ క్రియేటవుతుందని తెలిపారు.  కొంత మంది ఉద్యోగులు  హైబ్రిడ్ మోడల్‌‌‌‌పై కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ‘వారంలో మూడు రోజులు ఇంటి నుంచి , రెండు రోజులు ఆఫీస్‌‌‌‌ నుంచి ఎలా పనిచేయాలని అనుకుంటున్నారు? ఇలా అయితే నా షెడ్యూల్ మొత్తం చిందరవందరగా మారుతుంది’ అని ఓ ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీకి చెందిన మార్కెటింగ్‌‌‌‌ హెడ్‌‌‌‌ పేర్కోన్నారు. స్కూళ్లు ఇంకా ఓపెన్ కాకపోవడంతో వర్క్ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ చేసే భార్య భర్తలు తమ పిల్లలను చూసుకోవడానికి సులువుగా ఉండేది.  ఆఫీస్‌‌‌‌లకు తిరిగి రావడంపై ఉద్యోగులు ఇష్టపడకపోవడానికి ఇదొక కారణం. తిరిగి ఆఫీస్‌‌‌‌లకు వచ్చినా సరే ఉద్యోగుల మోటివేషన్‌‌‌‌ను కొనసాగించడం కూడా కంపెనీలకు పెద్ద తలనొప్పే! 

కంపెనీల ఖర్చులు బాగా తగ్గాయి..

వర్క్ మొత్తం డిజిటల్‌‌‌‌‌‌‌‌గా జరిగిపోతుండడంతో కంపెనీలకు పెద్ద మొత్తంలో ఖర్చులు మిగులుతున్నాయి. బిజినెస్‌‌‌‌‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌‌‌‌‌, పెద్ద పెద్ద హోటల్స్‌‌‌‌‌‌‌‌లో మీటింగ్‌‌‌‌‌‌‌‌లు లేవు. సుమారు 180 కంపెనీలు తమ ఖర్చులు తగ్గాయని ప్రకటించాయి. టీసీఎస్‌‌‌‌‌‌‌‌ అయితే ఏకంగా రూ. వెయ్యి కోట్లకు పైగా మిగల్చగలిగింది. 2019–20 లో టీసీఎస్‌‌‌‌‌‌‌‌ ట్రావెల్‌‌‌‌‌‌‌‌ ఖర్చులే రూ. 2,215 కోట్లు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2020–21 లో ఈ ఖర్చులు 70 శాతం తగ్గి రూ. 1,081 కోట్లుగా రికార్డయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రావెల్ ఖర్చులు రూ. 788 కోట్ల నుంచి రూ. 236 కోట్లకు తగ్గాయి. బజాజ్‌‌‌‌‌‌‌‌ ఆటో ట్రావెల్ ఖర్చులయితే ఏకంగా 93 శాతం తగ్గి రూ. 77 కోట్ల నుంచి రూ. 6 కోట్లకు దిగొచ్చాయి. ఆర్థిక సంవత్సరం 2020–21 లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌‌‌‌‌‌‌‌ ట్రావెల్ ఖర్చులు 81 శాతం తగ్గి రూ. 10 కోట్లుగా రికార్డయ్యాయి. అఫీషియల్ వర్క్ మొత్తం ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే జరుగుతుండడంతో ట్రావెల్ చేయాల్సిన అవసరం రావడం లేదని టాటా గ్రూప్ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. పెద్ద డీల్స్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌లు కూడా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే పూర్తవుతున్నాయని తెలిపారు. ఫార్మా కంపెనీ బయోకాన్ ట్రావెల్‌‌‌‌‌‌‌‌ ఖర్చులు 98 శాతం తగ్గి రూ. 87 కోట్ల నుంచి రూ. 2 కోట్లకు దిగొచ్చాయి. ఫార్మా వంటి ఇండస్ట్రీలలో వెండర్లను ఆడిట్‌‌‌‌‌‌‌‌ లేదా దర్యాప్తు చేయడానికి ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి ఉంటుందని బయోకాన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ కిరణ్ మజుందార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా పేర్కొన్నారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ట్రావెల్‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్ ఖర్చులు పెద్దగా తగ్గుతాయని ఆమె అనుకోవడం లేదు. హిందుస్తాన్ యూనిలీవర్ ట్రావెల్ ఖర్చులు రూ. 157 కోట్లు నుంచి రూ. 90 కోట్లకు తగ్గాయి. విప్రో ఖర్చులు రూ. 1,817 కోట్ల నుంచి రూ. 526 కోట్లకు, ఇన్ఫోసిస్ ఖర్చులు రూ. 2,710 కోట్ల నుంచి రూ. 554 కోట్లకు దిగొచ్చాయి.