
కలియుగ వైకుంఠం తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. శుక్రవారం ( జులై 4 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుమలలోని GNC దివ్యారామం నర్సరీ దగ్గర అటవీ ప్రాంతం తగలబడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఎండుటాకులు, చెట్లు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.. అయితే, అధికారులు వేగంగా స్పందించటంతో ప్రమాదం తప్పింది.
విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండాగా.. జూన్ 29న తిరుమల కొండపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ఆదివారం తిరుపతి నుంచి తిరుమల వెళ్లిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కర్ణాటక నుంచి వచ్చిన భక్తులకు ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుపతి నుంచి తిరుమల వెళ్లిన కారు జీఎన్సీ టోల్ గేట్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు కారు దిగి పరుగులు తీసారు.
ALSO READ : బెంగళూరులో మరో ఘోరం: ఏకంగా చుట్టాల ఇంటికే నిప్పు.. ట్విస్ట్ ఏంటంటే..
మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో భయబ్రాంతులకు గురయ్యారు భక్తులు. ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.