
షాద్ నగర్, వెలుగు: ఓటుకు దరఖాస్తు చేసుకున్నా రిజెక్ట్ చేస్తున్నారని, అసలు ఇది ప్రజాస్వామ్యమేనా..? అని ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టౌన్ లో సోమవారం ఎంపీడీవో ఆఫీసు వద్ద వారు ఆందోళనకు దిగారు. తమకు ఓటు వేసుకునే హక్కు కల్పించాలని నినాదాలు చేశారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు ఓటు వేసుకునే చాన్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం పెంచే ప్రయత్నం చేస్తున్నారా..? లేక తగ్గించే ప్రయత్నం కొనసాగుతుందా..? అంటూ ప్రశ్నించారు. రేపటి వరకు చూసి కోర్టును ఆశ్రయిస్తామని పలువురు టీచర్లు స్పష్టంచేశారు.