వీడియో కాల్స్ తో విసుగెత్తుతున్న ఉద్యోగులు

వీడియో కాల్స్ తో విసుగెత్తుతున్న ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగులాక్​డౌన్​తో అంతా డిజిటల్ మయంగా మారింది. 2 నెలలకు పైగా ఎంప్లాయీస్ వర్క్ ఫ్రం ​హోమ్ ​చేస్తున్నారు. వర్చువల్ గా కనెక్ట్ అవుతుండటంతో  వీడియో కాల్స్ కి ఇంపార్టెన్స్ పెరిగింది. ఆఫీస్ మెంబర్స్, క్లయింట్స్ తో మీటింగ్ కి ఇలాగే అప్రోచ్ అవుతున్నారు. ఈ కాన్ఫరెన్స్ మీటింగుల్లో సుమారు 5 నుంచి 10 మంది వరకు ఉంటారు. ఒక్కో కాల్ డ్యురేషన్ 50 నిమిషాల నుంచి గంటకు పైగా ఉంటోంది.  వీడియో కాన్ఫరెన్స్ లో ఎక్కువ టైం స్క్రీన్ చూస్తూ మీటింగ్ లోని పర్సన్ పై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూస్ గా స్క్రీన్ చూడటం వల్ల ఎంప్లాయీస్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. నిద్ర లేమి, ఇరిటేషన్, అసహనం, కోపంతోపాటు మానసిక ఆందోళనకు గురవుతున్నామని పలువురు చెప్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సరిగ్గా ఉండలేకపోతున్నామంటున్నారు. ఈ వీడియో కాల్స్ వల్ల సిటీలో చాలామంది ఎంప్లాయీస్ ఫెటీగ్ (అలసట) ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారని సైకాలజిస్ట్​లు చెప్తున్నారు.

ఇంట్లో వర్క్ అట్మాస్ఫియర్ లేక ..

వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఎంప్లాయీస్ కి ఇంట్లో ఆఫీస్​అట్మాస్ఫియర్, సెపరేట్ స్పేస్ ఉండదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో రూమ్ లో కూర్చుని ఆఫీస్ కాల్స్ అటెండ్ చేయాల్సి వస్తోంది. క్లయింట్స్ మీటింగ్స్, ఆఫీస్ కాన్ఫరెన్స్ లతో రాత్రుళ్లు నిద్రపట్టక తలనొప్పి, కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మీటింగ్ లో ఉన్నప్పుడు డిస్ట్రబెన్స్ వస్తే ఇంట్లో వారిపై చికాకు పడటం, వర్క్ పై ఇంట్రెస్ట్ చూపకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వర్క్ అయిపోయాక ఫ్రెండ్స్  తో మాట్లాడాలని అనుకున్నా.. మళ్లీ ల్యాప్ టాబ్, ట్యాబ్, సెల్ ఫోన్  స్క్రీన్ చూడాలనే భయంతో చాలామంది వీడియో కాల్స్ అంటేనే తెలియని అసహనానికి గురవుతున్నారు.

స్క్రీన్ చూసే టైమ్ తగ్గించాలి

కంటిన్యూస్ గా వీడియో కాన్ఫరెన్స్ ల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల  ఎంప్లాయీస్ లో ఇరిటేషన్​పెరుగుతోంది.  క్లయింట్స్ తో మాట్లాడేప్పుడు ఫోకస్ పెట్టి ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీటింగ్ లో వెబ్ కామ్ ఆఫ్ చేయలేరు. ఇంట్లో ఆఫీస్ వర్క్ చేసుకునే టైమ్ లో పిల్లల అల్లరి వల్ల యాంగర్ ఇరిటెబులిటీ వస్తుంది. నైట్ టైం కాల్స్ ఎక్కువగా ఉండటం వల్ల నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. దాంతో హాబిట్స్ మారి.. ఓవర్ ఈటింగ్, వెయిట్ గెయిన్ సమ్యసలు స్టార్ట్ అవుతున్నాయి.  ఇంట్లో ఒకే పొజిషన్ లో ల్యాప్ టాప్ పెట్టి ఫోకస్డ్ గా స్క్రీన్ చూడటం వల్ల కళ్లపై ఆ ప్రభావం పడుతుంది.  2 అవర్స్ మీటింగ్స్ కాకుండా 30 నిమిషాలు మాట్లాడుకుని బ్రేక్ తీసుకుంటే బెటర్.

– డా.హరిణి, సైక్రియాట్రిస్ట్

మీటింగ్ అవర్స్ పెరిగినయ్

వర్క్ ఫ్రం హోమ్ లో  భాగంగా స్టార్టింగ్ లో మధ్యాహ్నం, సాయంత్రం వీడియో కాల్స్ ఉండేవి.  క్లయింట్స్ వర్క్ ఎక్కువ కావడంతో   ఏప్రిల్ 15నుంచి డైలీ 3–4 సార్లు వీడియో కాల్స్ అటెండ్ చేయాల్సి వచ్చింది. మే నెలలో ఉదయం 10 గంటల నుంచే కాల్స్ స్టార్ట్ అయ్యాయి. మధ్యాహ్నం 12. 30, 3.30, 6 గంటల వరకు మీటింగ్స్ జరుగుతూనే ఉండేవి.  కాన్ఫరెన్స్ కాల్ లో క్లయింట్స్ నలుగురు, మా ఆఫీస్ నుంచి నలుగురం ఉంటాం. మీటింగ్ టైమ్ 45 మినిట్స్ నుంచి  గంటకు పైగా ఉంటుంది.  ల్యాప్ టాప్ పై  గంటల తరబడి వర్క్ చేయడం వల్ల  తలనొప్పి, బ్యాక్ పెయిన్,   టెన్షన్స్, ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వర్క్ ప్రెజర్ తో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైమ్ చాన్స్ ఉండట్లేదు.

– సునీల్ కుమార్, సీనియర్ అకౌంట్స్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్

 

ఫ్యామిలీస్ కు దూరంగా ఉంటున్న పోలీసులు