-are-not-paid-since-last-6-moths-in-the-state_B6cXLz0WAa.jpg)
మంచిర్యాల, వెలుగు: సంచార పశువైద్యశాలల (1962) ఉద్యోగులకు ఆర్నెల్లుగా జీతాలు రావడంలేదు. అరకొర జీతాలు కూడా నెలనెలా అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని సిబ్బంది వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో ప్రభుత్వం సంచార పశువైద్యశాలలను ఏర్పాటు చేసింది. ఒక్కో వెహికల్లో వెటర్నరీ డాక్టర్, డ్రైవర్, ప్యారావిట్, అటెండర్ లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించింది. రాష్ట్రంలో 400 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. 1962 అంబులెన్స్‌ల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన సర్కారు.. సిబ్బంది జీతాలను ఆ సంస్థ ద్వారానే చెల్లిస్తోంది. డాక్టర్‌కు రూ.40వేలు, ప్యారావిట్కు రూ.15వేలు, డ్రైవర్‌కు రూ.8వేలు, హెల్పర్‌కు రూ.7వేలు ఇస్తోంది. ప్రభుత్వం సక్రమంగా బడ్జెట్ రిలీజ్ చేయకపోవడంతో ఆర్నెల్లుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సంధ్య, ప్యారావిట్లు ప్రభాకర్, రత్నాకర్, డ్రైవర్ మల్లేశ్, హెల్పర్ ఎండీ.పారూఖ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు.