కేసీఆర్‌ను కలసిన ఉద్యోగ సంఘాల నేతలు

కేసీఆర్‌ను కలసిన ఉద్యోగ సంఘాల నేతలు

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణతోపాటు  ఇతర సమస్యలను పరిష్కరిస్తూ సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతలు పిసి రాజేందర్, మమత, శ్రీపాల్  తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడాన్ని సంతోషిస్తున్నామన్నారు. అలాగే రిటైర్మెంట్ 61 ఏళ్లకు పెంచడంతోపాటు సిపిఎస్ లో పనిచేస్తున్న లక్ష మంది ఉద్యోగుల్లో ఎవరైన చనిపోతే రాష్ట్ర సర్కారే.. ఎక్స్ గ్రేషియా కూడా ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం, ఏపీ లో పనిచేస్తున్న తెలంగాణ వారిని తెలంగాణకు తీసుకురావడం.. ఇక్కడి ళ్లు ఏపీకి వెళ్లడానికి ఆసక్తి ఉంటే.. పంపాలని సీఎం ఆదేశించడం మంచి నిర్ణయాలన్నారు. అందుకే కేసీఆర్ తోపాటు మంత్రి మండలికి , సహకరించిన ఎమ్మెల్యే లకు.. సీఎస్ సోమేశ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి.. అందరూ ఆశ్చర్య పడేలా సీఎం కేసీఆర్ ఫిట్మెంట్ ప్రకటించారని.. చిరు ఉద్యోగి కూడా.. కడుపునిండేలా 30 శాతం పీఆర్సీ ఇచ్చారన్నారు. ప్రభుత్వంలో వున్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ చేసేలా ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే ఓపిక సహనంతో.. ఉంటే.. సీఎం కేసీఆర్ అన్ని నెరవేరుస్తారని రుజువు అయిందన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేత శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రమోషన్లు, పీఆర్సీ తోపాటు మహిళా ఉపాధ్యాయులకు వేతనం తోకూడిన ప్రస్తుతి సెలవులు..రాష్ట్రంలో వుండే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు కేసీఆర్ సమన్యాయం చేశారని చెప్పారు.