
జూబ్లీహిల్స్, వెలుగు: అంబేద్కర్విశ్వవిద్యాలయం వి–హబ్ తో ఒప్పందం కుదుర్చుకుందని వర్సిటీ వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు ఉపాధి కోసం స్వల్పకాలిక వృత్తి విద్య కోర్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గురువారం రిటైలర్స్అసోసియేషన్ , స్కిల్ కౌన్సిల్ఆఫ్ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు.
రిజిస్ట్రేషన్చేసుకొని, ఫీజు చెల్లించిన వారికి త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామని వీసీ చెప్పారు. రూ.7 వేల నుంచి రూ.24 వేల వరకు వేతనం వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రొ.రవీంద్రనాథ్సోలమన్, ప్రొ.పల్లవి కబ్డే, ప్రొ.వడ్డాణం శ్రీనివాస్, విద్యార్థుల సేవా విభాగం డీన్ప్రొ.దయాకర్, ప్రొ.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.