కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈఎన్సీ అనిల్

కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈఎన్సీ అనిల్

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​ముందు ఈఎన్‌‌‌‌సీ అనిల్ హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ గ్రౌటింగ్​కు సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు కమిషన్​..ఆయన్ను పిలిచినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈఎన్​సీ అనిల్ కమిషన్ ఆఫీసుకు వెళ్లి వివరాలను సమర్పించినట్టు సమాచారం. విచారణలను పూర్తి చేసిన కమిషన్ ఇప్పటికే రిపోర్టుపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బ్యారేజీకి చేసిన గ్రౌటింగ్ పై అదనపు సమాచారాన్ని కమిషన్​ కోరినట్టు తెలిసింది. 

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత.. ఏడో బ్లాక్​కింద భారీ గొయ్యిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. బ్యారేజీకి మరింత నష్టం జరగకుండా ఈఎన్‌‌‌‌సీ అనిల్ అక్కడ గ్రౌటింగ్​ చేయించి గొయ్యిని పూడ్చారు. ఈ క్రమంలోనే గ్రౌటింగ్​ చేయడాన్ని నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ తప్పుబట్టింది.