5 దశాబ్దాల ప్రస్థానానికి బ్రేక్.. చారిత్రక ప్రధాన కార్యాలయం ఖాళీ చేయాలని కాంగ్రెస్‌కు కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. మరో మూడు రోజుల్లోగా24 అక్బర్ రోడ్డులోనికాంగ్రెస్ కార్యాలయం ఖాళీ చేయాలని నోటీసులిచ్చింది. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మార్చి 28 లోగా తమకు కేటాయించిన 24 అక్బర్ రోడ్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఎస్టేట్ విభాగం కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలను తెలిపారు. కేంద్రంతీరుతో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ ఉనికికి ముగింపు పడనుంది.
24 అక్బర్ రోడ్ ఆఫీసు బంగళా గత 48 ఏళ్లుగా పార్టీకి కీలక కేంద్రంగా సేవలందిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాలన్నింటికీ వేదికైంది. గత ఏడాదే కోట్లా మార్గ్‌లో నిర్మించిన ఇందిరా భవన్ కు కాంగ్రెస్ తన ప్రధాన కార్యాలయాన్ని మార్చింది. కొత్త ఆఫీసు ఉన్నప్పటికీ, సెంటిమెంట్ ,లోతైన అనుబంధం కారణంగా పార్టీ ముఖ్యమైన కార్యకలాపాలు, సమావేశాలు ఇప్పటికీ అక్బర్ రోడ్ నుంచే సాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
కేవలం ప్రధాన కార్యాలయమే కాకుండా 5 రైసినా రోడ్‌లోని యూత్ కాంగ్రెస్ ఆఫీసును కూడా ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరంగా ఎదుర్కోవాలని సిద్దమవుతోంది. ఎన్నికల వేళ ఇలాంటి నోటీసులు రావడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.