పైప్ గ్యాస్ ఉంటే LPG సిలిండర్లు కట్ : కేంద్రం సంచలన ప్రకటన

పైప్ గ్యాస్ ఉంటే LPG సిలిండర్లు కట్ : కేంద్రం సంచలన ప్రకటన

మీ  నగరం లేదా ప్రాంతంలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ (PNG) కనెక్షన్ ఫెసిలిటీ ఉంటే, మీరు తప్పనిసరిగా దానికి మారాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ గా కీలక ఆదేశాలు జారీ చేసింది. మీ ఇంటికి  లేదా దగ్గరలో పైపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉండి కూడా మీరు తీసుకోకపోతే, 3 నెలల తర్వాత మీకు వచ్చే ఎల్‌పిజి (LPG) సిలిండర్ల సప్లయ్ అంటే LPG కనెక్షన్ నిలిపివేయనుంది. 

 ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాల వల్ల విదేశాల నుండి గ్యాస్ దిగుమతి చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే పైపుల ద్వారా వచ్చే గ్యాస్‌ను ప్రోత్సహించి, సిలిండర్ల వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పట్టణాల్లో సిలిండర్ల వాడకం తగ్గించి, ఆ గ్యాస్‌ సిలిండర్లను పైప్‌లైన్ గ్యాస్ సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు/ ప్రాంతాలకు పంపడం ఈ పథకం ఉద్దేశ్యం.

►ALSO READ | మన హైదరాబాద్‎లోనే కాదు.. మిగతా రాష్ట్రాల్లోనూ పెట్రోల్ కొరత.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు..!

మీరు PNG కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, కేవలం 48 గంటల్లోపు మీకు కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.  హౌసింగ్ సొసైటీలు లేదా అపార్ట్‌మెంట్ యాజమాన్యాలు గ్యాస్ పైపులు వేయడానికి అడ్డు చెప్పకూడదు. ఒకవేళ అడ్డుకుంటే, ఆ ప్రాంతంలో సిలిండర్ల సప్లయ్  ఆగిపోయే ప్రమాదం ఉంది. సాంకేతికంగా మీ ఇంటికి పైపు గ్యాస్ ఇవ్వడం కుదరదు అని అధికారులు ధృవీకరిస్తే తప్ప, మిగతా అందరూ ఈ నిబంధన పాటించాల్సిందే.

 PNG కనెక్షన్ వల్ల లాభాలు:
దీని వల్ల సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే గ్యాస్ అయిపోతుందనే భయం లేకుండా 24 గంటలు వాడుకోవచ్చు. సిలిండర్ల డెలివరీ కోసం వేచి చూడాల్సిన పని ఉండదు. ఈ కొత్త నిబంధనల అమలును PNGRB (పెట్రోలియం & సహజ వాయు నియంత్రణ బోర్డు) పర్యవేక్షిస్తుంది.