కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు

కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు

వేములవాడ, వెలుగు: భక్తులు ఎంతో విశ్వాసంగా చూసే రాజన్న కోడెల సంరక్షణలో ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎండోమెంట్‌‌ కమిషనర్‌‌‌‌ హనుమంతురావు హెచ్చరించారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి సంబంధించిన గోశాలను సందర్శించారు. కోడెలు చాలా నీరసంగా ఉన్నాయని, వారం రోజుల్లో మార్పు రావాలని, తౌడు, దాణా సరిగ్గా ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఈవోను ఆదేశించారు. గోశాలల నుంచి ఇచ్చే  కోడెలకు తప్పనిసరిగా  ట్యాగ్ ఏర్పాటు చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో ఆలయ ప్రాంగణం, గోశాలలో పందిర్లు వేయాలన్నారు. కమిషనర్ వెంట ఏఈవోలు హరికిషన్, జయకుమారి,  శ్రీనివాస్, ప్రతాప నవీన్, ఈఈ రాజేశ్‌‌, డీఈ రఘునందన్, ఏఈ శేఖర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీ రాములు, తిరుపతిరావు పాల్గొన్నారు.