ఈడీ, సీబీఐని సరిహద్దులకు పంపాలి

ఈడీ, సీబీఐని సరిహద్దులకు పంపాలి

ముంబై: జమ్మూ కశ్మీర్‌‌లోకి టెర్రరిస్టులను రానివ్వకుండా అడ్డుకోవడానికి ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐను బార్డర్స్‌‌కు పంపాలని శివ సేన పేర్కొంది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు దిగుతున్న రైతులపై కేంద్ర సర్కార్ వ్యవహరిస్తున్న తీరును శివ సేన తప్పుబట్టింది. తన అధికార పత్రిక సామ్నాలో కేంద్రంపై శివ సేన ఫైర్ అయ్యింది. అన్నదాతలను ఉగ్రవాదులుగా చూస్తున్నారంటూ కేంద్రాన్ని విమర్శించింది. బీజేపీ దేశ వాతావరణాన్ని నాశనం చేయడమే గాక నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందంటూ సామ్నా రాసుకొచ్చింది.

‘విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఈడీ (ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్), సీబీఐను కేంద్ర సర్కార్ ప్రయోగిస్తోంది. ఈ ఏజెన్సీలకు తమ శౌర్యాన్ని చూయించడానికి అవకాశం కల్పించాలి. ప్రతిసారి బుల్లెట్లు పనిచేయవు. ఢిల్లీ సరిహద్దుల్లో మన రైతులను ఉగ్రవాదులుగా పిలుస్తున్నారు. నిజమైన టెర్రరిస్టులు జమ్మూ కశ్మీర్‌లో బార్డర్‌‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈడీ, సీబీఐని సరిహద్దులకు పంపాలి. వారికి మరో ఆప్షన్ లేదు’ అని సామ్నా రాసుకొచ్చింది.