శివబాలకృష్ణ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ

శివబాలకృష్ణ కేసు..   రంగంలోకి దిగిన ఈడీ

హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ మాజీ డైరెక్టర్‌‌, రెరా సెక్రటరీ‌‌ శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో ఈడీ రంగంలోకి దిగింది.  శివబాలకృష్ణపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీ అధికారులను కోరిందిఈడీ.  ఎఫ్‌ఐఆర్‌, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 

శివబాలకృష్ణకు214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్స్‌‌, విల్లాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌‌ వ్యాల్యూ ప్రకారం రూ.250 కోట్ల కంటే రెట్టింపు ఉంటుందని అంచనా వేశారు. ప్రాంతాల వారీగా చూసుకుంటే వీటి విలువ దాదాపు రూ.650 కోట్లు దాటే అవకాశం ఉంది. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను గత నెల24న  ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. బుధవారంతో కస్టడీ ముగియగా నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌‌గూడ జైలుకు తరలించారు.