ICC World Cup 2023: ENG vs AFG మ్యాచ్కు హాజరైన కోహ్లీ, సునీల్ నరైన్

ICC World Cup 2023: ENG vs AFG మ్యాచ్కు హాజరైన కోహ్లీ, సునీల్ నరైన్

వరల్డ్ కప్2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, పసికూన ఆప్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచులో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ, విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో అరున్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈమ్యాచ్ ను ప్రేక్షకుల మధ్యలో కూర్చోని తిలకించారు. విరాట్ కోహ్లీ టీమిండియా జెర్సీని ధరిస్తే..సునీల్ నరైన్ కోల్ కతా నైట్ రైడర్స్ జెర్సీని ధరించి...ఇద్దరూ స్టైలీష్ గాగుల్స్ పెట్టుకుని మ్యాచ్ ను వీక్షించారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, సునీల్ నరైన్ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


కోహ్లీ వచ్చాడా..?
ఇంగ్లాండ్, ఆప్ఘనిస్తాన్ మ్యాచును వీక్షించేందుకు కోహ్లీ వచ్చాడు. కానీ ఇతను నిజమైన కోహ్లీ కాదు..కోహ్లీ పోలికలు ఉండే ఓ వ్యక్తి..ఢిల్లీలోన అరుణ్ జైట్లీ స్డేడియంలో హల్ చల్ చేశాడు. అచ్చం కోహ్లీని పోలి ఉండే వ్యక్తిని చూసి ప్రేక్షకులకు నిజమైన కోహ్లీ అనుకున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు ఆరాట పడ్డారు. దగ్గరి వరకు వచ్చాక..ఇతను కోహ్లీ కాదు..అతని డూప్ అని నిరుత్సాహ పడ్డారు. అయినా కూడా కోహ్లీ డూప్ తో సెల్ఫీలు తీసుకున్నారు. 

నిజంగా సునీల్ నరైనేనా..?
ఇంగ్లాండ్, అప్ఘనిస్తాన్ మ్యాచ్ ను వీక్షించేందుకు సునీల్ నరైన్ వచ్చాడని స్టేడియంలో కొందరు ప్రేక్షకులకు చెప్పడంతో  అభిమానులు అతని దగ్గరకు చేరుకున్నారు. దూరం నుంచి చూసి వావ్ సునీల్ నరైన్ సామాన్యుడిలా ప్రేక్షకుల మధ్యలో  కూర్చోని మ్యాచ్ ను వీక్షిస్తున్నాడని సంబరపడ్డారు. దగ్గరకు వచ్చి చూసే సరికి అసలు విషయం తెలిసీ నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే అతను విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ కాదు..అతని డూప్. కానీ అచ్చం సునీల్ నరైన్ పోలి ఉన్నాడు. అతని ముఖం, మోహక్ హెయిర్ స్టైల్, సన్ గ్లాసెస్,  చెవికి కమ్మ ధరించడం, మెడ వెనకాల నరైన్ లాగా టాటూ వేయించుకోవడం చూస్తే సేమ్ టూ సేమ్ సునీల్ నరైన్ వలే ఉన్నాడు. దీంతో అభిమానులు కూడా పొరబడ్డారు. ప్రస్తుతం ఈ డూప్ సునీల్ నరైన్ ఫోటోలు, వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. 

మ్యాచ్ జరుగుతుండగా కెమెరా అతన్ని చూపించడంతో..స్టేడియంలో ప్రేక్షకులకు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. తనను కెమెరాలో చూపెట్టారని తెలుసుకున్న డూప్ సునీల్ నరైన్..అభిమానులకు అభివాదం చేశాడు. 

ఈ వరల్డ్ కప్ కు వెస్టిండీస్ టీమ్ అర్హత్ సాధించలేదు. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో వెస్టిండీస్ ఓడిపోవడంతో ఈ వరల్డ్ కప్ ఆడే జట్లలో స్థానం దక్కించుకోలేకపోయింది.