స్టీవ్‌‌ స్మిత్‌‌ సెంచరీ: ఆస్ట్రేలియా 416

స్టీవ్‌‌ స్మిత్‌‌ సెంచరీ: ఆస్ట్రేలియా 416

లండన్‌‌: ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న యాషెస్‌‌ రెండో టెస్ట్‌‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. మాజీ కెప్టెన్​ స్టీవ్‌‌ స్మిత్‌‌ (184 బాల్స్‌‌లో 15 ఫోర్లతో 110) కెరీర్‌‌లో 32వ సెంచరీతో చెలరేగడంతో గురువారం రెండో రోజు ఆసీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 100.4 ఓవర్లలో 416 రన్స్‌‌ చేసింది. 339/5 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన కంగారూలను ఇంగ్లిష్‌‌ బౌలర్లు కట్టడి చేశారు. అలెక్స్‌‌ క్యారీ (22), కమిన్స్‌‌ (22 నాటౌట్‌‌) కాసేపు బ్యాట్లు అడ్డేసినా, మిచెల్‌‌ స్టార్క్‌‌ (6), నేథన్‌‌ లైయన్‌‌ (7), హాజిల్‌‌వుడ్‌‌ (4) నిరాశపర్చారు.

రాబిన్సన్‌‌, జోష్‌‌ టంగ్‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ ఆట ముగిసే టైమ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌లో 61 ఓవర్లలో 278/4 స్కోరు చేసింది. బెన్‌‌ డంకెట్‌‌ (98), క్రాలీ (48), పోప్‌‌ (42) రాణించారు. హ్యారీ బ్రూక్‌‌ (45 బ్యాటింగ్‌‌), బెన్​ స్టోక్స్‌‌ (17 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.