ENG vs AUS: వరుసగా ఐదో ఓటమి.. డిఫెండింగ్ ఛాంపియన్స్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

ENG vs AUS: వరుసగా ఐదో ఓటమి.. డిఫెండింగ్ ఛాంపియన్స్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్ జట్టు పోరాటం ముగిసింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ సేన 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఆసీస్ నిర్ధేశించిన 287 పరుగుల లక్ష్య ఛేదనలో..  ఇంగ్లిష్ బ్యాటర్లు 253 పరుగులకే  కుప్పకూలారు. ఇంగ్లాండ్ జట్టుకు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం.

ఆస్ట్రేలియా నిర్ధేశించిన 287 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ చేధించలేకపోయింది. బెన్ స్టోక్స్(64), డేవిడ్ మలాన్(50) హాఫ్ సెంచరీలు చేయగా.. మొయిన్ అలీ(40) పర్వాలేదనిపించారు. జానీ బెయిర్‌స్టో(0), జో రూట్(13), జోస్ బట్లర్(1), లివింగ్ స్టోన్(2) మరోసారి విఫలమయ్యారు. ఆఖరిలో అదిల్ రషీద్(20), క్రిస్ వోక్స్(32) జోడి పోరాడినా.. ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 286 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్‌ లబూషేన్ (71; 83 బంతుల్లో 7 ఫోర్లు), కామెరూన్‌ గ్రీన్‌ ( 47; 52 బంతుల్లో 5 ఫోర్లు), స్టీవ్ స్మిత్‌ (44) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, అదిల్ రషీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.