బెయిర్ స్టో సెంచరీ : న్యూజిలాండ్ కు ఛాలెంజింగ్ టార్గెట్

బెయిర్ స్టో సెంచరీ : న్యూజిలాండ్ కు ఛాలెంజింగ్ టార్గెట్

చెస్టర్ లీ సిటీ: వరల్డ్ కప్-2019 భాగంగా న్యూజిలాండ్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 రన్స్ చేసింది. ఇంగ్లండ్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు జేసన్ రాయ్ హాఫ్ సెంచరీ, బెయిర్‌ స్టో సెంచరీతో రాణించారు. వీరిద్దరి జోరు చూస్తుంటే ఇంగ్లండ్ 350 స్కోర్ దాటేలా కనిపించింది. రాయ్, బెయిర్ స్టో ఔట్ అయ్యాక రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో ఆ తర్వాత ప్లేయర్లు తక్కువ రన్స్ కే పరిమితమయ్యారు. మోర్గాన్, చివర్లో వచ్చిన బౌలర్లు పర్వాలేదనిపించడంతో.. న్యూజిలాండ్ కు ఛాలెంజింగ్ టార్గెట్ ను ముందుంచింది ఇంగ్లండ్.

న్యూజిలాండ్ బౌలర్లలో..ట్రెంట్ బౌల్ట్, మట్ హెన్రీ, నిషామ్ తలో 2 వికెట్లు తీయగా..సాట్నర్, టిమ్ సౌధీకి చెరో వికెట్ దక్కింది.