
బ్రిస్టల్: ఏడేళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ తో చక్కని పోరాటపటిమ కనబరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా 2టీమ్స్ మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్ లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. ఈ మ్యాచ్ తో భారత టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేసింది.