
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 138 ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఐటీ విభాగాలో ఖాళీలు ఉన్నాయి.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత పొందాలి. గేట్ 2023 అర్హత సాధించాలి. గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ఆన్లైన్లో ఏప్రిల్ 18 వరకు అప్లై చేయాలి. వివరాలకు www.powergrid.in వెబ్సైట్లో సంప్రదించాలి.