ఇంజనీరింగ్, ఫార్మసీ  ఎగ్జామ్స్​ వాయిదా

ఇంజనీరింగ్, ఫార్మసీ  ఎగ్జామ్స్​ వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఈ నెల14 నుంచి జరగాల్సిన జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వర్క్స్​, వైవా పూర్తిచేసేలా చర్యలు మొదలుపెట్టారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడితే వాయిదా పడిన ఎగ్జామ్స్ జులై 1 నుంచి జరపాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. వర్సిటీ పరిధిలో బీటెక్, బీఫార్మసీ ఫైనలియర్ స్టూడెంట్లు దాదాపు 40 వేల మంది వరకు ఉంటారు. ఒక్కో కోర్సులో ఫైనల్ సెమిస్టర్​లో మూడు, నాలుగు పరీక్షలే ఉంటాయి. దీంతో జులై ఫస్ట్ వీక్​లో పరీక్షలు పూర్తి చేసి, 20 లోపు ఫైనలియర్ రిజల్ట్ ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు.